మహబూబ్‌నగర్

చేనేతరంగ సంక్షేమానికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 22: చేనేతరంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జౌళిశాఖ డైరెక్టర్ ప్రీతిమీనన్ అన్నారు. గురువారం గద్వాల పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో చేనేతన్నల స్థితిగతులు, సమస్యల పరిష్కారం కోసం నడిగడ్డ ప్రాంతంలో మూడు రోజుల పాటు వారి సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చేందుకు పర్యటన చేపట్టినట్లు ఆమె తెలిపారు. గద్వాల, రాజోళి, అయిజ, గట్టు, ఎక్లాస్‌పురం ఆయా గ్రామాల్లో చేనేతలు ఉపాధిలేక దూర ప్రాంతాలకు వెళ్లి జీవనం గడుపుతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం గద్వాలలో రూ.1.70లక్షలతో క్లస్టర్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా డయ్యింగ్‌కు రూ.50లక్షలు, కామన్‌స్పెషలిస్టుకు రూ.50లక్షలు, డిజైనర్‌కు రూ.10 లక్షలు, ప్రోగ్రాం ట్రైనింగ్‌కు రూ.30లక్షలు, కార్మికులకు ఉపాధి చూపేందుకు మిగతా నిధులను ఖర్చు చేస్తుందన్నారు. అదేవిధంగా మార్కెటింగ్‌లో కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం, మార్పులను చేనేత కార్మికులకు శిక్షణ కూడ ఇచ్చేందుకు నిపుణులైన వారి ఆధ్వర్యంలో శిక్షణలు ఏర్పాటు చేస్తామన్నారు. క్లస్టర్ ద్వారా ఉత్పత్తి చేసిన వస్త్రాలను బయటిమార్కెట్‌లో విక్రయించి మిగులు వస్త్రాలను టెస్కో కొనుగోలు చేస్తుందన్నారు. కార్మికులకు ప్రభుత్వం సబ్సిడిపై నూలు, సిల్క్ తదితర ముడిసరుకును ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా నేతన్నలు మాట్లాడుతూ అనారోగ్యం క్షీణించి మరణించిన నేతన్నలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని, ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులకు రూ.4కోట్ల సబ్సిడి నిధులు మంజూరు కావాల్సి ఉందని ఆమె దృష్టికి తీసుకవచ్చారు. గత 15 సంవత్సరాల క్రితం గద్వాల డివిజన్‌లో చేనేత హ్యాడ్‌లూం పార్క్ కొరకు రూ.50లక్షలు కేటాయించినా నేటి వరకు ఆచరణలోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నేతన్నల సమస్యలపై స్పందించినందుకు ఆనందదాయకమన్నారు. చేనేత సమస్యలపై రామలింగేశ్వర్‌కాంమ్లే పలు నివేదికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవచ్చారు. ప్రతి సమస్యను పరిష్కారం చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ఈమె వెంట మేనేజింగ్ డైరెక్టర్ శైలజరామయ్యర్, డిప్యూటీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు, హేమంత్‌కుమార్, తిరుమల్‌రావు, విఎస్‌ఎన్ రెడ్డి, గోవిందు, చేనేత కార్మికులు తదితరులు ఉన్నారు.