మహబూబ్‌నగర్

అభివృద్ధిని అడ్డుకుంటున్న టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూత్పూర్, సెప్టెంబర్ 22: పాలమూరును అభివృద్ధిని అడ్డుకుంటున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని , ఆయన పాలమూరు జిల్లాను దత్త తీసుకుని చేసింది శూన్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దిల్లీలో అపెక్స్ సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై గట్టి వాదనలు వినిపించడంతో కేంద్ర మంత్రి ఉమాభారతి సానుకూలంగా స్పందించడంపై కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎమ్మెల్యేలైన రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డికి పాలమూరుపై ఇంగితజ్ఞానం, చీము రక్తం ఉంటే పార్టీ విడిచిపెట్టి పాలమూరు ప్రజల పక్షాన ఉండి ప్రాజెక్టులపై పోరాటాలు చేయాలని ఎమ్మెల్యే ఆల అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులను సాగునీరు అందించడం జరిగిందని, గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు 40శాతం చేస్తే 90శాతం డబ్బులు మంజూరు చేసి మింగేశారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ,డిండి ప్రాజెక్టు నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే ఆల అన్నారు. కెసిఆర్ పాలమూరు ఎంపిగా ఉన్నప్పుడు కరువు, వలసలు అధికంగా ఉన్నాయని గుర్తించి, జిల్లాను అభివృద్ధి చేస్తున్నారన్నారు. విలేఖరుల సమావేశంలో జడ్పీటిసి చంద్రవౌళి, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బస్వరాజ్‌గౌడ్, సినియర్ నేతలు నారాయణగౌడ్, చెన్నమ్మ, రంగయ్యశెట్టి, శివరాములు పాల్గొన్నారు.