మహబూబ్‌నగర్

భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: జిల్లాలో భారీ నుండి అతిబారీ వర్సం వివిధ మండలాల్లో కురిసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో చెరువులు, కుంటలు నిండి ఆలుగులు పారుతున్నాయి. కొన్ని మండలాల్లో అతిభారీ వర్షం కురియడంతో చెరువులకు, కుంటలకు గండ్లు పడ్డాయి. వర్షం నీరు వృధాగా పోతుండడంతో పలు గ్రామాల ప్రజలు నీటిని ఆపుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో ఓ పక్క బారీ వర్షం, మరోపక్క ఈదురు గాలులు కూడా విస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావం జిల్లాపై తీవ్రప్రభావం చూపింది. జిల్లాలోని పలు పట్టణాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని జలమయమైయ్యాయి. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ పట్టణంలో బుధవారం అర్థరాత్రి ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురిసింది. దింతో రోడ్లన్ని జలమయంగా మారి పెద్ద చెరువుకు వెళ్లే కాలువ పొంగిపొర్లింది. గురువారం ఎడతెరిపి లేని ముసురు వర్షం కురుస్తుంది. దింతో పట్టణమంతా చిత్తడిగా మారింది. ఇది ఇలా ఉండగా జిల్లాలోని బాలానగర్ మండలంలో 10.4మి.మీల వర్షం కురిసింది. కొందుర్గు 22.4మి.మీ, తలకొండపల్లి 10.మి.మీ, ఆమనగల్లు 11మి.మీ, మాడ్గుల 57మి.మీ, వెల్దండ 9.4మి.మీ, మిడ్జిల్ 12మి.మీ, కల్వకుర్తి 22.6మి.మీ, వంగూర్ 18.2మి.మీ, అచ్చంపేట 64.3మి.మీల భారీ వర్షం కురిసింది. అచ్చంపేటలో కురిసిన భారీ వర్షానికి పట్టణంలో రోడ్లన్ని జలమయంగా మారాయి. దాంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. ఉప్పునుంతల మండలంలో 40.0మి.మీ, తెల్కపల్లి 81.0మి.మీ, తాడూర్‌లో 181.4మి.మీ, నాగర్‌కర్నూల్ 89.2మి.మీల కుంభవృష్టి కురిసింది. దింతో తాడూర్ మండలంలోని చెరువులు కుంటలు నిండి ఆలుగులు పారుతున్నాయి. పలు గ్రామాల్లోని చెరువులకు, కుంటలకు గండ్లు పడ్డాయి. తెల్కపల్లి, తాడూర్, నాగర్‌కర్నూల్, ఉప్పునుంతల, అచ్చంపేట మండలాల్లో కురిసిన భారీ వర్షానికి చెరువులు నిండుకుండలా మారాయి. ఆయా మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిన్నచింతకుంట 22మి.మీ, నర్వ 55.0మి.మీ, ధరూర్ 12మి.మీ, ఆత్మకూర్ 26.6మి.మీ, వనపర్తి 10మి.మీ, బల్మూర్ 100.2మి.మీ, లింగాల 47మి.మీ, పెద్దకొత్తపల్లి, గద్వాల, పెబ్బేర్ 16మి.మీ, పాన్‌గల్ 21.4మి.మీ, అలంపూర్ 26.2మి.మీ, మానవపాడు 10.2మి.మీ, వడ్డెపల్లి 16.2మి.మీ, వీపనగండ్ల 15.8మి.మీ, కొల్లాపూర్ 15.6మి.మీ, ఇటిక్యాల 16మి.మీల భారీ వర్షం కురిసింది. జిల్లాలో గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు 34 అడుగులకు గాను 24 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. మరోపక్క ఊకచెట్టు వాగు అనుకుని ఉన్న చెరువులు, కుంటలు నిండాయి. దాంతో తుమ్మలకుంట చెరువు నిండి ఆలుగు పారుతుంది. జిల్లాలోని కాగ్నానది వాగులన్ని ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఢిండివాగు సైతం పారుతుంది. కాగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షానికి అక్కడ పలు కాలనీలు జలమయం కావడంతో ఆయా కాలనీలలో వలస కూలీలుగా ఉన్న పాలమూరు కూలీల స్థితిగతులపై వారి కుటుంబికులు ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. అదేవిధంగా హస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల యోగక్షేమాల గురించి తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఓ పక్క హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలు జిల్లా ప్రజలను కూడా ఆందోళన కలిగిస్తుంది. లక్షలాది మంది వలస కూలీలు హైదరాబాద్‌లో ఉంటున్నందున వారి కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా జిల్లాలో కూడా నిరంతరంగా వర్షం కురుస్తుండడంతో మట్టి మిద్దెలకు ముప్పు పొంచి ఉంది. దినిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఏది ఎమైన జిల్లాలో కురుస్తున్న వర్షంతో పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.