మహబూబ్‌నగర్

హైడ్రామా మధ్య ప్రజావైద్యుడి దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాలటౌన్, సెప్టెంబర్ 23: నూతన జిల్లాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్వాలను జిల్లాగా ప్రకటించకపోవడంతో గద్వాల ప్రజలు, నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. అందులో భాగంగా జెఎసి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. గత మూడు రోజుల క్రితం గద్వాలలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు మోహన్‌రావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. గద్వాల జిల్లా అయ్యేంత వరకు దీక్షను విరమింపజేసేది లేదని వారు తెలిపారు. అయితే శుక్రవారం హైడ్రామా మధ్య పోలీసులు దీక్షకు చేరుకొని వైద్యుడిని బలవంతంగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు రాజకీయ నేతల కనుసన్నల్లో ఉంటూ దీక్షను భగ్నం చేయడం సమంజసం కాదన్నారు. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా జిల్లా కావాలని ఆకాంక్ష మేరకు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టిన ఉద్యమకారులను బలవంతంగా దీక్షలను భగ్నం చేయడం ఏమిటని ప్రశ్నించారు. జెఎసి నాయకులు మూడు రోజుల బంద్ ప్రకటించిన నేపథ్యం పోలీసులు అదునుగా భావించి దీక్షను భగ్నం చేశారు.
ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాటలు చోటు చేసుకుంటున్న సమయంలో పట్టణవాసులంతా డిపో వద్దకు పరుగులుపెట్టారు. ఇదే అదునుగా భావించిన డిఎస్పీ బాలకోటి, సిఐ సురేష్‌లు పోలీసుల బలగాలతో ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి చేరుకొని దీక్ష చేపడుతున్న డాక్టర్ మోహన్‌రావును బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం, ఉద్యమకారులు, పోలీసుల మధ్య తోపులాటలు జరిగాయి.