మహబూబ్‌నగర్

వర్షానికి 189 ఇళ్లు నేలమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, సెప్టెంబర్23: వనపర్తి డివిజన్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారం రోజుల్లో 189 ఇళ్లు కూలినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈనెల 16న కొత్తకోట మండలంలో 4, పాన్‌గల్ మండలంలో1, పెబ్బేరు మండలంలో 15, గోపాల్‌పేట మండలంలో 24, వనపర్తి మండలంలో 10 మొత్తం 54 ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. 17న కొత్తకోట మండలంలో 1, పెబ్బేరు మండలంలో 26, వనపర్తి మండలంలో 3, వీపనగండ్ల మండలంలో 8 మొత్తం 38 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. 19న పాన్‌గల్ మండలంలో 3, గోపాల్‌పేట మండలంలో 27, వనపర్తిలో 1 మొత్తం 31 ఇళ్లు కూలిపోయినట్లు తెలిపారు. 20వ తేదిన పాన్‌గల్ మండలంలో 7, వనపర్తి మండలంలో 2, పెద్దమందడి మండలంలో 4 మొత్తం 1 ఇండ్లు నెలమట్టం అయ్యాయి. 21వ తేదిన పాన్‌గల్ మండలంలో 3, ఖిల్లాఘణపురంలో2, గోపాల్‌పేట మండలంలో2, వీపనగండ్ల మండలంలో 1 మొత్తం 8 ఇళ్లు కూలిపోయినట్లు తెలిపారు. 22న కొత్తకోట మండలంలో 16, పాన్‌గల్ మండలంలో 4, పెబ్బేరు మండలంలో 10, ఘణపురం మండలంలో 1, గోపాల్‌పేట మండలంలో 7, వనపర్తి మండలంలో 2, పెద్దమందడి మండలంలో 3, వీపనగండ్లలో 2 మొత్తం 45 ఇళ్లు కూలినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.