మహబూబ్‌నగర్

జూరాల ఐదు గేట్ల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధరూరు, సెప్టెంబర్ 23: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.400 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగవ ప్రాంతం నుంచి 70వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి దిగువకు 20,830 క్యూసెక్కుల శ్రీశైలం జలాశయంలోకి విడుదల చేస్తున్నారని జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి 40వేల క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, కుడి, ఎమడ కాలువకు 450, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. అదేవిధంగా ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయంలో 519.600 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 27,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతుంది. అక్కడి విద్యుత్ ఉత్పత్తి కోసం 25వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయంలో 123.081 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నారాయణపూర్ జలాశయంలో 492.200 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 18,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దీంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా దిగువకు 12,600 క్యూసెక్కులను వదులుతున్నారు. అక్కడి విద్యుత్ ఉత్పత్తి కోసం 6వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్‌లో 33.078 టిఎంసిల నీరు నిల్వ ఉంది.
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి...
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జెన్‌కో అధికారులు ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రాజెక్టు నుంచి 40వేల క్యూసెక్కులను వినియోగించుకొని ఐదు యూనిట్లలో 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు అధికారులు తెలిపారు.