మహబూబ్‌నగర్

బైపాస్‌తో పాలమూరుకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 23: బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాలమూరు పట్టణానికి మహర్ధశ నెలకొంటుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం వందకోట్లతో తలపెట్టిన బైపాస్ రోడ్డు ఏర్పాటుకు క్రిష్టియన్‌పల్లి దగ్గర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డు ఏర్పడితే పాలమూరు ప్రజల చీరకాల వాంచ నేరవేరిందని అన్నారు. పట్టణంలో రోడ్లు ఇరుక్కుగా ఉండడం వల్ల ఇప్పటి వరకు పట్టణ ప్రజలు ట్రాఫీక్ సమస్యతో సతమతమవుతున్నారన్నారు. పట్టణ ప్రజలు ఎదుర్కోంటున్న ట్రాఫీక్ సమస్యలు సమూలంగా పరిష్కరించడంతో పాటు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడం కోసం బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కేటాయించని నిధులు తెలంగాణ ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం కేటాయిస్తుందని ఆయన పెర్కోన్నారు. అందులో భాగంగానే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డుకు నిధులు యుద్దప్రతిపాదికన పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. బైపాస్‌రోడ్డు ఏర్పాటు పాలమూరు పట్టణ ప్రజల చీరకాల వాంచ తీరుస్తుందని అంతేకాక పాలమూరు పట్టణ అభివృద్దికి , పట్టణంలోని ప్రజల అభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. రోడ్డు ఏర్పాటుతో పట్టణంలోని భూములకు ధరలు పెరుగుతాయని అంతేకాక భైపాస్ చుట్టూపక్కల వాణిజ్యపరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు అవుతాయని ఆయన తెలిపారు. ఈ బైపాస్ రోడ్డు ఏర్పాటు కోసం ఎవరి ఇళ్లను తొలగించకుండా చేసేందుకు కోసం అవసరమైన విధంగా రోడ్డు మ్యాప్‌ను రూపొందించడం జరిగిందని ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఓ జ్యోతి, టిఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, ఆనంద్‌గౌడ్, పిల్లి సురేష్, ఇంజనీర్లు పాల్గొన్నారు.