మహబూబ్‌నగర్

ప్రతి విద్యార్థి భావిభారత పౌరుడిగా తయారవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, సెప్టెంబర్ 23: ప్రతి విద్యార్థి భావిభారత పౌరులుగా తయారు కావాలని కలెక్టర్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం అలంపూర్ పట్టణ సమీపంలో గల మాంటిస్సోరి స్కూల్‌లో జరిగిన ఇంటరాక్టివ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అబ్దుల్‌కలాం, పివి సిందు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి అలవాటు చిన్నతనంనుండే అలవడుతుందని ఈ వయసులో మంచి అలవాట్లు నేర్చుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి మంచిగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు, ఉన్న ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి పాఠాన్ని అవగాహన చేసుకుని చదవాలని సూచించారు. కాలం ఎంతో విలువైనదని ప్రతి రోజు 8 గంటలు నిద్రకు ఉపయోగిస్తున్నామని మిగతా సమయంలో ఇతరపనులకు కేటాయించి సమయం వృధా చేస్తున్నట్లు సమయం వృధా కావడం వల్ల జీవితంలో ఎంతో సమాచారం కోల్పోతామని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు కలెక్టర్‌ను ఘనంగా ఆహ్వానం పలికి సత్కరించారు. అంతకుముందు కలెక్టర్ అలంపూర్‌లోని శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు కలెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మంజుల, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.