మహబూబ్‌నగర్

దంచికొడుతున్న వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ధ్రోణితో జిల్లాలో వాన దంచికొడుతుంది. ఐదు రోజుల నుండి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడం జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలకు వెళ్లే బీటి రోడ్ల బ్రిడ్జిలపై వర్షపునీరు వరదలా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో దాదాపు 1634 చెరువులు నిండి ఆలుగులు పారుతున్నాయి. మరో 2000లకుపైగా చిన్న చిన్న కుంటలు నిండి ఆలుగులు పారుతూ వాగులు, వంకలను తన్వితీరా పారిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడం జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. మట్టి మిద్దెలు ఉన్న వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే జిల్లాలో దాదాపు 68 మట్టిమిద్దె ఇళ్లు కూలీనట్లు అధికారికంగా నిర్థారించారు. ఆయా మండలాల తహశీల్దార్లు, గ్రామ కార్యదర్శులు కూలీ ఇళ్ల దగ్గరకు వెళ్లి పరిశీలిస్తూ బాధితులకు చేయుతనిస్తున్నారు. ఇంకా వర్షాలు కురుస్తుండడంతో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ ప్రజలకు అధికారులు తెలుపుతున్నారు. కొత్తకోట మండలంలో గురువారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేని 6.4సెం.మీల భారీ వర్షం కురియడంతో ఆ మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. తలకొండపల్లి మండలంలో సైతం 5.4సెం.మీల వర్షం కురిసింది. ఈ మండలంలో ప్రతిరోజు 4సెం.మీలకు పైగానే వర్షం కురుస్తుండడం చెరువులు, కుంటలు ఆలుగులు పారుతున్నాయి. మక్తల్ మండలంలో కుంభవృష్టి కురిసింది. 5.6సెం.మీల భారీ వర్షం పడింది. కొత్తూర్, మాడ్గుల, మిడ్జిల్, దేవరకద్ర, కల్వకుర్తి, అచ్చంపేట, తెల్కపల్లి, సిసికుంట, బల్మూర్, పెబ్బేర్, గోపాల్‌పేట, ఆత్మకూర్, మాగనూర్, నర్వ, అడ్డాకుల, తాడూర్, కేశంపేట, షాద్‌నగర్, ఆమనగల్లు మండలాల్లో 4 నుండి 5సెం.మీల భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కురియడంతో ఈ మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దిగువన ఊకచెట్టువాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. కాగ్నా, దుందుబీనదులు వరద నీటితో జలకళ సంతరించుకుంది. బొంరాస్‌పేట పెద్ద చెరువుతో పాటు కొడంగల్ నియోజకవర్గంలో పలు చెరువులు ఆలుగులు పారుతున్నాయి. ఏది ఎమైనప్పటికిని జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మాత్రం చెరువులు, కుంటలు నిండాయి.