మహబూబ్‌నగర్

గద్వాలలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 23: గద్వాల జిల్లా చేయాలంటూ నడిగడ్డ ప్రజల ఆగ్రహజ్వాలాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. దీంతో శుక్రవారం నడిగడ్డలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అంతుచిక్కకుండా ఉద్యమకారులు తమదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం నుండి మూడు రోజుల బంద్‌కు జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. మొదటి రోజు బంద్ విజయవంతమైంది. ఉదయం తెల్లవారుజాము నుండే కొత్తబస్టాండు, పాతబస్టాండు, అయిజ రోడ్డు మార్గం, రాయచూరు రోడ్డు మార్గం నందు ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. ఒక వైపు పోలీసులు, మరో వైపు ఉద్యమకారుల మధ్య కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇది అదునుగా భావించిన పోలీసులు ఉద్యమకారులను అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యమకారుల ముందు వారి పాచికలు పారలేదు. అయితే తెరాసకు చెందిన ఆటోమక్బుల్ సెల్‌టవరెక్కి గద్వాలను జిల్లాచేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. గద్వాల జిల్లా కొరకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమని, తాను మాత్రం టవర్ నుండి కిందకు వచ్చే ప్రసక్తే లేదని వివరించారు. టవరెక్కిన ఉద్యమకారుని కిందకు దించే ప్రయత్నంలో పోలీసులు, రెవెన్యూ ఉన్నతాధికారులు ఫోన్‌లో సంభాషించినప్పటికీ ససేమిరా అన్నారు. తన డిమాండ్ జిల్లా అయ్యేదాకా నిరసన తెలుపుతానని భీష్మించుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఉత్కంఠకు ఆర్డీఓ అబ్దుల్ హమీద్ అక్కడికి వచ్చి కలెక్టర్‌కు, ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశామని, కిందకు దిగిరావాలని కోరడంతో...మక్బుల్ కిందకు దిగివచ్చారు. మరోవైపు పట్టణంలో స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి. పట్టణంలోని ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక ధోరణిని విడనాడి గద్వాలను జిల్లా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి, ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించారు. జెఎసి ఆధ్వర్యంలో కొత్తబస్టాండు ఆవరణలో వంటావార్పు చేపట్టి నిరసన తెలియజేశారు.
డిపో వద్ద ఉద్రిక్తత వాతావరణం...
శాంతియుతంగా చేపట్టిన మూడు రోజుల బంద్‌కు జెఎసి, అఖిల పక్షం నాయకులు బస్సులను అడ్డుకునే సమయంలో పోలీసులు, ఉద్యమకారుల మధ్య కాస్త గందరగోళం నెలకొంది. ఓ వైపు ఏం జరుగుతుందోనని ఊహించలేదు. పోలీసు గోబ్యాగ్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జిల్లాను సాధించుకునే తరుణంలో పోలీసులు అత్యుత్సాహం చూపడం మంచిపద్ధతి కాదని నాయకులు విమర్శించారు. గత కొన్ని నెలలుగా జిల్లా చేయాలంటూ నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చకముందే ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడాల్సిందిగా పేర్కొన్నారు. మొదటి రోజు నిర్వహించిన బంద్ విజయవంతమైందన్నారు.
ఉద్యమకారుల ముందు తోకముడిచిన పోలీసులు...
గద్వాల మూడు రోజుల సకల జనుల బంద్ సందర్భంగా ఉద్యమాన్ని అణచివేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను పట్టణంలో మొహరించారు. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న జెఎసి నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు వాహనాలను సిద్ధం చేసుకొని ముందుకు రాగా ఉద్యమకారులు సైతం పెద్ద సంఖ్యలో ఎదురునిలిచి పోలీసులను వారించారు. అదే విధంగా సెల్‌టవరెక్కి నిరసన తెలిపిన మక్బుల్‌ను టవర్ దిగిన వెంటనే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించేందుకు వాహనంలో ఎక్కించారు. ఇది తెలుసుకున్న ఉద్యమకారులు పోలీసు వాహనాన్ని అటకాయించి వందలాది మంది యువకులు వాహనం ముందు కదలకుండా నిలిచి మక్బూల్‌ను విడుదల చేయాలని పట్టుపట్టారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా తోకముడిచి మక్బుల్‌ను విడిచిపెట్టక తప్పలేదు. అక్కడి నుండి జెఎసి నేతలు, గట్టు తిమ్మప్ప, గడ్డం కృష్ణారెడ్డిలు ఆర్డీఓ అబ్దుల్ హమీద్ దగ్గరకు తీసుకువచ్చి ర్యాలీ నిర్వహించారు.