మహబూబ్‌నగర్

ప్రమాదకరంగా జాతీయ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూత్పూర్, సెప్టెంబర్ 25: జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించడానికి రహదారి విస్తరణకు కోట్లాది రూపాయలతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. భూత్పూర్‌లో కిలోమీటర్ మేర వంతెన నిర్మాం చేపట్టగా, వంతెనకు ఇరువైపులా కాల్వల నిర్మాణం చేపట్టిన వృథాగా మారింది. ఇంటర్నల్ రహదారికి మరమత్తులు చేపట్టకపోవడంతో రహదారి గుంతల మయంగా మారింది. వంతెన సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్డు పక్కన కాల్వల ఏర్పాటు చేయకపోవడంతో వర్షం నీరు చేరి వరిచేను రోడ్డుపై వేసినట్టుగా మారింది. బ్రిడ్జి కింద వర్షం నీరు పోవడానికి దారి లేకపోవడంతో నీరు నిలవడంతో గుంతలుగా మారి వాహన దారులు ప్రమాదాలకు గురౌతున్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో చిన్న పాటి వర్షానికి సైతం రోడ్డుపై వర్షం నీరు చేరి రహదారి గుంతలుగా మారింది. అధికారులు చొరవ తీసుకుని రహదారికి మరమత్తులు చేపట్టాలని గ్రామస్ధులు కోరుతున్నారు.