తెలంగాణ

మిషన్ భగీరథకు మోదీ శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్:ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ తొలి దశను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. గజ్వేల్ మండలం కోమటిబండలో దీనికి సంబంధించిన నీటిట్యాంకును ఆయన ప్రారంభించారు. ఆదివారం ప్రారంభమైన ఈ పథకంలో తొలిదశగా 234 గ్రామాలకు నీరందుతుంది. రామగుండం ఎన్‌టిపిసి ధర్మల్ విద్యుత్‌కేంద్రం, ఎరువులకర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్ రైల్వేలైన్, మిషన్ కాకతీయ పైలాన్, వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, జైపూర్‌లోని ధర్మల్ విద్యుత్‌కేంద్రాలకు ఈ సందర్భంగా మోదీ శిలాఫలకాలు ఆవిష్కరించారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్రమంత్రులు పీయుష్‌గోయల్, వెంకయ్య,దత్తాత్రేయ సహా పలువురు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.