సంపాదకీయం

దూరవౌతున్న నేపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్‌కూ మనకూ మధ్య స్నేహ సంబంధాలు అడుగంటిపోతుండడం చైనా ప్రభుత్వం వారి వ్యూహంలో భాగం. మన ఇరుగు పొరుగు దేశాలతో మన మైత్రిని చెడగొట్టడం చైనా ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. చైనా జరుపుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి నేపాల్ రంగస్థలం కావడం వర్తమాన ఘట్టం. నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ ఓలీ శర్మ జనవరి నెలలో చైనాను సందర్శిస్తున్నట్టు ఉప ప్రధాని కమల్ థాఫా వెల్లడించారు. అక్టోబర్‌లో ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఖడ్గ ప్రసాద్ శర్మ జరుపనున్న తొలి విదేశీ పర్యటన ఇది. నేపాల్ ప్రధానమంత్రులు పదవిని చేపట్టిన తరువాత మొదటగా మనదేశానికి వచ్చివెళ్లడం దశాబ్దుల సంప్రదాయం. రాజరికం రద్దయిన తరువాత 2008లో నేపాల్ అధ్యక్షుడుగా ఎన్నికైన రామ్ భరణ్ యాదవ్ కూడ మొదట మనదేశంలోనే పర్యటించారు. కానీ నేపాల్ ఏకీకృత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ మహానేత పుష్పకుమార్ దహల్ ప్రచండ తొలిసారిగా ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించాడు. 2008లో ప్రధాని పదవిని చేపట్టిన ప్రచండ తొలి విదేశీయ పర్యటనగా చైనాను సందర్శించాడు. భారత-నేపాల్ సంబంధాలలో అలజడిని సృష్టించాడు. ఇప్పుడు మల్లీ ఖడ్గ ప్రసాద్ శర్మ ఇదే అలజడిని కలిగిస్తున్నాడు. శర్మ ప్రధాని హోదాలో ఇంతవరకు మనదేశానికి రాలేదు. చైనాకు వెడుతున్నట్టు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. చైనాకు వెళ్లేలోగా ఆయన మొదట మనదేశంలో పర్యటించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. కానీ ఎప్పుడు పర్యటిస్తాడన్నదీ ఇంతవరకు వెల్లడి కాలేదు. నేపాల్ నూతన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాధేశీ ప్రజలు సాగిస్తున్న ఆందోళన నేపథ్యంలో మన ప్రభుత్వాన్ని బెదిరించడానికై ఓలీ మొదట చెనాకు వెడుతున్నట్టు ప్రచారవౌతోంది. నేపాల్ ప్రజలందరూ భారతీయ సంతతివారే. కానీ మాధేశీలు సమీపగతంలో బిహార్, ఉత్తర ప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వలసవెళ్లి తరాయ్ తదితర నేపాల్ దక్షిణ సీమలలో స్థిరపడిన వారు. వీరిలో అత్యధికులు హిందీ మాట్లాడుతున్నారు. మన ప్రభుత్వం అండ చూసుకొని మాధేశీలు నూతన రాజ్యాంగ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారన్నది నేపాల్ ప్రభుత్వ ఆరోపణ. తమకు నూతన రాజ్యాంగ వ్యవస్థలో అన్యాయం జరుగుతోంది కాబట్టి తాము ఆందోళన చేస్తున్నామన్నది మాధేశీల మాట. ఏమయినప్పటికీ ఈ ఆందోళనను మనదేశానికీ, నేపాల్‌కు మధ్య వైరుధ్యాలను పెంచడానికి చైనా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.
పుష్పకమల్ ప్రచండ 2009లో ప్రధాని పదవిని వదులుకోవలసి వచ్చింది. ఆయనగారి చైనా అనుకూల వ్యూహం బెడిసికొట్టడమే ఇందుకు కారణం. అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ ఈ మావోయిస్టు నాయకుని ఆటలను సాగనివ్వలేదు. ప్రచండ తరువాత ప్రధానిగా ఎన్నికైన మాధవ కుమార్ నేపాల్ ఏకీకృత మావోయిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీకి చెందినవాడు. 1995లో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయిన తరువాత ఇలా మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడినాయి. మావోయిస్టు పార్టీవారు 2004 వరకు సాయుధ సమరం జరిపి భయానక బీభత్సకాండను సృష్టించారు. పదమూడువేల మందిని బలిగొన్నారు. చివరికి 2005లో సాయుధ సమరాన్ని విడనాడి ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ పట్ల నిబద్ధతను ప్రకటించారు. మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీ వారు మాత్రం 1995 నుంచి కూడ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నిబద్ధులై ఉన్నారు. ఈ పార్టీకి చెందిన మాధవ కుమార్ కూడ అపధానిగా ఎన్నికైన తరువాత మొదట మనదేశానికే వచ్చి వెళ్లారు. 2011, ఫిబ్రవరిలో ప్రధాని పదవిని చేపట్టిన ఝూలానాథ్ ఖనల్ కూడ మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీకి చెందినవాడు. 2011 ఆగస్టులో ప్రధానిగా ఎన్నికైన బాబూరామ్ భట్టారాయ్ మావోయిస్టు పార్టీకి చెందినవాడు. రాజ్యాంగ పరిషత్‌కు రెండవసారి ఎన్నికలు జరిగిన తరువాత నేపాల్ కాంగ్రెస్ అధినేత 2014 పిబ్రవరిలో ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు ప్రధాన మంత్రులు కూడ తొలిసారి సందర్శించిన విదేశం మనదేశమే. 2014 మే నెలలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవీ స్వీకార ఉత్సవానికి కూడ సుశీల్ కుమార్ కోయిరాలా హాజరు కావడం ఉభయ దేశాల చారిత్రక మైత్రి మరింత పటిష్టం కావడానికి దోహదం చేసింది. 2014 ఆగస్టులో నరేంద్ర మోదీ నేపాల్‌లో పర్యటించడం ఈ పటిష్ట మైత్రికి మరో నిదర్శనం...
మావోయిస్టుల ప్రాబల్యం కొనసాగిన ఐదేళ్లపాటు దిగజారిన భారత-నేపాల్ సంబంధాలు మళ్లీ ఇలా మెరుగుపడడానికి కారణం 2013 నాటి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో మావోయిస్టులు ఘోర పరాజయం పాలు కావడం. మెరుగుపడుతున్న సంబంధాలు గత సెప్టెంబర్‌లో ‘నూతన రాజ్యాంగ’ ఆవిష్కరణ తరువాత మళ్లీ దిగజారి పోవడానికి కారణం మావోయిస్టుల వ్యూహం, నేపాల్ మావోయిస్టులు చైనా కమ్యూనిస్టు పార్టీ వారి చంక బిడ్డలు. 2008వ, 2013వ సంవత్సరాల మధ్య మొదటి రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన చేయకుండా మావోయిస్టులు అవరోధాలను కల్పించారు. ఓటర్ల అభిశంసనకు గురై రెండోసారి జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఈ ఓటమి తరువాతనే రాజ్యాంగ రచన చరుకుగా కొనసాగింది. మావోయిస్టుల సహకారం లేకపోయినప్పటికీ రాజ్యాంగం రూపొందడానికి రంగం సిద్ధమైంది. అందువల్ల వ్యూహం మార్చిన చైనా ప్రతినిధులు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టారు. ఇలా రెచ్చగొట్టడంలో భాగంగా నేపాల్‌ను ఎనిమిది రాష్ట్రాలుగా ఏర్పాటు చేసే సమాఖ్య-ఫెడరేషన్- స్ఫూర్తిని ప్రచారం చేశారు. మాధేశీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్న రాజకీయ పార్టీలు ఈ సమాఖ్య జాలంలో చిక్కుకున్నాయి. ఫలితంగా ఈ పార్టీలు మావోయిస్టుల వెనక చేరాయి. నేపాల్ వంటి చిన్న దేశాలకు సమాఖ్య వ్యవస్థ కంటె ఏకీకృత రాజ్యాంగ వ్యవస్థ మేలు. కానీ సమాఖ్య పేరుతో వివిధ ప్రాంతాల మధ్య విభేదాలను రగిలించడం మావోయిస్టుల ఎత్తుగడ. చివరికి ఎనిమిది రాష్ట్రాలను ఏడుకు కుదించారు. మాధేశీలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలను ఐదు రాష్ట్రాలతో కలిపి వారిని చెల్లాచెదరు చేశారు. దీన్ని మాధేశీలు నిరసిస్తున్నారు. నేపాల్‌లోని ప్రస్తుత కల్లోలానికి ఇదీ నేపథ్యం. ఈ కల్లోలం కారణంగా మనదేశం నుంచి సరకుల రవాణా తగ్గిపోయింది. మన ప్రభుత్వం ఈ దిగ్బంధానికి కారణమన్నది నేపాల్ ప్రభుత్వ ఆరోపణ. రాకపోకలను నిరోధించడం లేదని మనప్రభుత్వం అనేకసార్లు స్పష్టీకరించినప్పటికీ నేపాల్ ప్రభుత్వం మాత్రం మనపై రుసరుసలాడుతూనే ఉంది.
మాధేశీల సమస్యను పరిష్కరించడం మాత్రమే కల్లోలాలనుంచి నేపాల్‌కు విముక్తి. కానీ ఉభయ కమ్యూనిస్టుపార్టీలు ఉమ్మడిగా తమ దేశాన్ని చైనా ఒడిలో కూర్చుండబెట్టడానికి కృషి చేస్తున్నాయి. నేపాల్ ఉప ప్రధానమంత్రి చైనాలో ఏకబిగిన వారం రోజులపాటు పర్యటించి రావడం కుట్రలో భాగం. నేపాల్ పార్లమెంటు-రాజ్యాంగ పరిషత్-లో అతిపెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్. కానీ ఆ పార్టీకి ప్రధాని పదవి కాని, అధ్యక్షపదవి కాని దక్కకపోవడానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి వ్యూహం కారణం. ఈ వ్యూహకర్త చైనా ప్రభుత్వం..