అర్చన

శ్రీహరే ఇలా వచ్చాడా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణుడు నోరు తెరిచాడు. యశోదమ్మ చూస్తూ ఉంది. ఆ నోటి లో14 భువన భాండాలు కదలాడుతున్నాయి. ఆకాశము, భూదేవి, రేపల్లె, తాను, నందుడు, ఇతర గోపాలురు అందరూ అందులోనే ఉన్నారు. ఆ తల్లికి ఒక్కక్షణం మతిస్థిమితం కోల్పోయానా అనిపించింది. మళ్లీ ‘లేదు లేదు. ఇదంతా విష్ణుమాయ ఈ చిన్నివాడు పైగా నా కొడుకు వీని నోటిలో బ్రహ్మాండమంతా కనిపిస్తున్నది అంటే నిజంగా ఇతడు మామూలు పిల్లవాడు కాదు. సామాన్యుడు అసలే కాదు.. శ్రీహరినే ఇలా వచ్చాడా. నన్ను ఉద్దరించడానికి వచ్చాడు. అది అంతమూ లేని పుట్టుక చావు లేని పరమాత్మ నే ఈ బాలుని రూపంలో నా దగ్గరకు వచ్చాడా అనుకొని పరమాత్మ స్తోత్రం చేయసాగింది. ‘ఓ అనంతనామధేయా ఓ నిర్వికారా! నిరంజనా! ’అంటూ స్తుతిస్తోంది. కృష్ణుడు యశోదను మేను తట్టి ‘‘అమ్మా! చూచావా నా నోటిలో నీకు మన్ను కనిపించిందా? నేను మన్ను తినలేదన్నదే నిజం కదా... చెప్పు అమ్మా.. మాట్లాడవేమి ’అన్నాడు.
అంతే మరుక్షణం యశోదమ్మను మాయ కమ్మేసింది. తన ఎదురుగా పరమాత్మ స్థానంలో తన కొడుకు కనిపించాడు. జరిగింది మర్చిపోయింది. కొడుకనుకొని పరమాత్మను గట్టిగా గదమాయించింది. కోప్పడి ఇంకొక సారి ఇలా కల్లలాడావంటే నీకు కష్టాలు తప్పవని హెచ్చరించింది. ‘బలరామా! నీవు తమ్ముణ్ణి ఒక కంట కనిపెట్టి ఉండు. అల్లరి చిల్లర పనులు చేస్తంటే వీనిచెవి పట్టుకొని నీ దగ్గరకు తీసుని రా అప్పుడు వీని పని చెబుతాను’అంది. బలరాముడు సుధాముడు తమ్ముడిని తీసుకొని దూరంగా పోయారు. యశోదమ్మ లౌకిక పనుల్లో మునిగిపోయింది. తన కొడుకే పరమాత్మ అన్న విషయాన్ని గుర్తించినట్లే గుర్తించి మరునిముషంలో మాయామోహితురాలై మరిచిపోయింది. ఇవన్నీ లీలామానుషవిగ్రహుడైన కృష్ణునికే చెల్లుతుంది కదా.
ఇరులు పూర్తిగా తొలగకముందే యశోదమ్మ కాలకృత్యాలుతీర్చుకోవడం భగవంతుని పూజించడం పూర్తిచేసింది. ఇక పెరుగు చిలుకుదామని వచ్చింది. కవ్వపు తాడు పట్టుకొని పెరుగు చిలుకుతూ ఉంది. ఆ తల్లిని అపుడే నిద్రలేచిన చిన్ని బాలుడు కృష్ణుడు చూశాడు. ‘అమ్మా’ అంటూ గారాలు పోతూ పిలిచాడు. మా తండ్రే మా నాయనా అంటూ పిలుస్తోంది కాని కవ్వాన్ని వదలిపెట్టలేదు. కృష్ణుని దగ్గరకు తీయలేదు. నందగోపాలుడు యశోదమ్మ దగ్గరకు వచ్చాడు. అటు ఇటూ తిరుగుతూ తనకు పాలివ్వమని అడుగుతున్నాడు. కవ్వాని అటు ఇటు తిప్పుతుండడం చేత యశోదమ్మ చీర కదలబారుతోంది. ఆ చీర కొంగును పట్టుకుని లాగుతూ ముందు నాకు పాలివ్వు అంటూ గోల చేస్తున్నాడు గోపాలుడు.
పని చేయనివ్వకుండా అడ్డుపడేవాడికి పాలివ్వందే పని కాదనుకొంటూ తాను కూర్చుని గోపాలుణ్ణి ముద్దు చేస్తూ తన ఒడిలో కూర్చునబెట్టుకుంది. హృదయంలోకి దూరిపోతూ పాలకోసం వెతుకుతున్న కృష్ణయ్య మరింత దగ్గరకు తీసుకొని తన స్తన్యాన్ని నోటికందించింది. ఎంతో ఆత్రంగా పాలు తాగుతున్నాడు కృష్ణుడు.
అంతలో యశోదమ్మకు తాను పొయ్యిపైన పాలు పెట్టి వచ్చిన ట్లు జ్ఞాపకం వచ్చింది. కృష్ణుని చూడగా కనులు ఆర్పుమోడులయి ఉన్నాయి. మాగన్నుగా నిద్ర పోతున్నట్లుగా ఉన్నాడు. ఏమాత్రం దెబ్బతగలకుండా కృష్ణుని తన ఒడినుంచి కిందికి దింపి తాను వంటింట్లోకి వెళ్లింది.
దొంగల్లో దొరయైన కృష్ణయ్య యశోదమ్మ ను చూచాడు. ఎక్కువగా కోపం తెచ్చుకున్నాడు. తన్ను కాదని వెళ్లిన అమ్మపై అలిగినట్లుగా పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని తీసుకొని పెరుగుకుండను కొట్టాడు. ఆ రాయి దెబ్బకు పెరుగుకుండ చిల్లుపడి పెరుగు ఇల్లంతా పరుచుకుంది. అందులోని వెన్నను తీసుకొని తింటూ బుడి బుడి రాగాలు తీస్తున్నాడు మన కథానాయకుడు.
లోపలి నుంచి వచ్చిన యశోద కృష్ణుని అల్లరి కళ్లారా చూచింది. వెంటనే కోపం తెచ్చుకుంది. ‘ఏమిరా! ఇపుడే కదా. నీకు పాలిస్తున్నాను. అంతలో నీవు పెరుగు కుండ పగులకొట్తావా ఉండు నీ పని చెబుతా’అంటూ కృష్ణుని పట్టుకోవడానికి పెద్ద పెద్ద అంగలు వేసిందా ఆ అంగనామణి. కృష్ణుడు తప్పించుకొంటూ వీధిలోకి పారిపోయాడు. య శోద కాలు జారి పెరుగులో పడింది. దాంతో కృష్ణుని పై మరింత కోపం తెచ్చుకుని ఎలాగైనా వీనికి బుద్ధిచెప్పాల్సిందే అనుకొంది. వాని వెంట పడి పట్టుకోవాలని చేతిలో బెత్తం పట్టుకొని వీధిలోకి నడిచింది.

- చరణ శ్రీ