అర్చన

అర్థాలు..అంతరార్థాలెన్నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే’’
అంటూ సంధ్యాదీపాలు పెట్టి మహాలక్ష్మీ పూజను ఘనంగా చేసే పర్వదినమే దీపావళి. ఈ దీపావళి ప్రభాత వేళలో
‘‘తైలే లక్ష్మీర్జతే గంగా దీపావళి ఆధావసేత్
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే’’
దీపావళినాడు నువ్వెల నూనెలో లక్ష్మీదేవి, నదులు చెఱువులు బావులు మొదలైన జల వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి ఉంటారు. ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయంలో అభ్యంగన స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దారిద్య్రబాధ దూరవౌతుంది.గంగానదీ స్నాన ఫలం లభిస్తుం ది.్భగవంతుని పూజించే క్రమంలో అంటే షోడశోపచారాల్లో దీపారాధన కూడా ప్రాముఖ్య మైనదే.
సాయంత్రం మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి, దూది ఏకులతో వత్తుల్ని చేసి, వాటిని ప్రమిదలలో వేసి, మొదటగా ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చేసి, తరువాత యింటి బయట అమర్చిన ప్రమిదలలోని వత్తులను వెలిగించి ఒక పంక్తిగా, వరుసగా దీపాలు పెట్టడం సంప్రదాయం.
మనిషిలోని ఈర్ష్య అసూయ ద్వేషం స్వార్థం అధర్మం, అవినీతి అనేవి చీకటికి సంకేతం. ప్రేమ మంచితనం సత్ప్రవర్తన ధర్మం అనేవి వెలుగుకు సంకేతం. చీకటిని పారద్రోలి జ్ఞాన వెలుగును అనుగ్రహించి, జీవితానికి చైతన్యదీప్తినిచ్చే పండు గ- దీపావళి.
అజ్ఞాన తమస్సును తరిమివేసే తారావళినే దీపావళిగా పెద్దలు అభివర్ణిస్తుంటారు. అమావాస్యనాడే - ‘‘అమా’’ అంటే, దానితోపాటు అని అర్థం. ‘‘వాస్య’’ అంటే వసించటం. అంటే చంద్రుడు సూర్యుడిలో చేరి, వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు. సూర్యుడు స్వయంప్రకాశమైన పరమాత్మ చైతన్యం. చంద్రుడు- జీవుడు- మనస్సు ఆయన ఉపాధి. మన మనస్సు పరమాత్మ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధించటమే నిజమైన అమావాస్య. దీనికి ప్రతీకగా దీపాలను అమావాస్య రోజు వెలిగించడం ఆచారంగా వచ్చింది.
‘‘దీప్యతే అనేన’’ అనే వ్యుత్పత్యర్థాన్ని బట్టి సమస్త విశ్వము దేని చేత ప్రకాశింపబడునో దానినే ‘’‘దీపము’’ అన్నారు. అట్లానే ‘‘యజ్ఞోవైవిష్ణుః’’ అన్నారు ఈ దీపారాధన చేయడమే ఒక యజ్ఞం. మహావిష్ణువును ఆరాధించినట్లే దీపారాధన చేయడమంటే.‘ఉద్దీప్యస్య జాతవేదో పఘ్నన్ నిర్ ఋతింమమ’’ అగ్నిదేవా నా పాపములను పోగొట్టి నాకుజ్ఞానమనే వెలుగును ప్రసాదించమని ప్రార్థిస్తారు.
ఆశ్వయుజ బహుళ అమావాస్యనాటి సంధ్యా సమయంలో వరుసగా దీపాల్ని పెట్టి ఇంటిని దీపములతో అలరించి, ఆ వెలుగులో మహాలక్ష్మీదేవిని దర్శించి ఆరాధించడం కూడా దీపావళినే. దీపావళి పక్కరోజు నుంచి కార్తికం ఆరంభవౌతుంది. దీపావళి నాడు కాశీలోని గంగానదిలో దివ్యవెలుగుల దీపాలవరుసను పేర్చి గంగాహారతినిస్తారు.
ప్రమిదలోని వత్తి శరీరంగాను, జ్వాలను ప్రాణంగాను, నూనెను కర్మఫలంగాను, భావిస్తే కర్మఫలం ఉన్నంత వరకే ఈ శరీరం ఉంటుందని వత్తి ఎలా కాలుతూ ఉంటే అది తరిగిపోతుం టుందో అలానే శరీరం కూడా శిథిలమై పోతుంటుందని అలా శరీరం శిథిలావస్థకు చేరకుముందే భగవంతుని గూర్చి తెలుసుకో వాలని శాస్త్రం లోని అంతరార్థంగా చెబుతారు.
చతుర్థశ్యాంతు మేదీపాన్ నరకాయ దదాతిచ
తేషాం పితృగణా స్సర్వే నరకాత్ స్వర్గమాప్నుయూః
చతుర్ధశి నాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని శాస్త్ర వచనం. వ్రతచూడామణిలో యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయ యమ బాధలు లేకుండా చేయడమే దీపావళి ఆంతర్యం అని చెబుతుంది.
మరోకథనం ప్రకారం వామనావతారంలో మహావిష్ణువు బలికిచ్చిన వరం వల్ల బలి పేరిట దీపాలు వెలిగిస్తారని వామనపురాణ గాథ చెబుతుంది.

- చాముండేశ్వరి