అర్చన

పండుగల పరమార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం పుణ్యభూమి. కర్మభూమి. భారతీయులు జరుపుకునే ప్రతి పర్వములోను, పండుగలోను విశేషార్థాలుంటాయి. ప్రతి పండుగను కూడా పరిశీలిస్తే అందులోని అంతరార్థాన్ని గ్రహిస్తే సర్వమానవాళి కల్యాణానికి ఉపయుక్తమైన విధులు నిర్వర్తించాలన్న సందేశం ఉంటుంది. దసరా, దీపావళి లాంటిపండుగలను అధర్మం పై ధర్మవిజయానికి తార్కాణాలుగా నిలుస్తాయి. ఉగాది, వసంత పంచమి లాంటి ఋతువుల్లో వచ్చే మార్పులకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పేవిగా ఉంటాయి. నెలలవారిగా వచ్చే పండుగల్లోను అంటే శ్రావణ, భాద్రపదం, కార్తికం, ధనుర్మాసం ఇలా ఏ మాసం తీసుకొన్నా అపుడుంటే ప్రకృతి, వాతావరణం మానవునికి ఎలా ఉపయుక్తంగా వుండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతాయి. ఇలా భారతీయులు ఏం చేసినా అందులోని మర్మం అంటే రహస్యాన్ని తెలుసుకొని నిర్వర్తిస్తే వచ్చే ఫలితాలు మరింత ఉపయోగకారిగా ఉంటాయన్న ఉద్దేశంతో కె. రామ్మోహన్‌రావుగారు ‘‘హిందువుల పండుగలు వైశిష్ట్యము’’ అన్న పేరు మీద చిన్నపొత్తాన్ని సంకలనం చేసి పాఠకులకు అందించారు.
ఇందులో ఉగాది, సంస్కృతి, శ్రీరామ నవమి, జగద్విదితం .. శంకరాద్వైతం మొదలుకొని తత్ప్రణామామి సదాశివ లింగం, వసంత ఋతువదిగదిగో .. హోళి దాకా వివిధ శీర్షికలతో వివిధ పండుగలను వాటి విశిష్టతను కూలంకషంగా వివరించారు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే పదాల పొందికతో వ్రాసిన ఈ పుస్తకం పండుగల గురించి తెలుసుకోవాలనుకొనేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. వారికే కాక అందరికీ కూడా ఏ పండుగ ఎందుకు చేసుకోవాలన్న దానికి కూడా హేతుబద్ధంగా వివరిస్తూ పండుగల పరమార్థాలను తెలిపే ఈ పుస్తకాన్ని ప్రతివారిని చదివిస్తుంది.
*
హిందువుల పండుగలు వైశిష్ట్యము
రచన: కె. రామ్మోహన్ రావు
వెల: రూ.100/-లు
ప్రతులకు
1-3-18,కవాడిగూడ , హైదరాబాదు
ఫోన్‌నెం. 040- 27533177,
సెల్ నెం. 9441435912

- అలేఖ్య