అర్చన

అగ్రేసరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజనాదేవికి కేసరి అనే వానరరాజుకు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన ఆంజనేయుణ్నే పవనకుమారుడు, హనుమంతుడు, మారుతి అనే వివిధ పేర్లతో పిలుచుకుంటారు.హను శబ్దో జ్ఞానవాచీ హనుమాన్ మతి శబ్దః’ హన అను ధాతువునుండి పుట్టిన హను శబ్దమునకు జ్ఞానము అనే విశేషార్ధం ఉంది. హను అనగా జ్ఞానం. దానిని బట్టి హనుమంతుడు అంటే జ్ఞానవంతుడు అని తెలుస్తున్నది. హనుమంతుడు గుణవంతుడు, బలవంతుడు, జ్ఞాననిష్ఠుడు అని జానపదుల వాక్కు. భక్తికి పోతపోసిన విగ్రహ రూపమే హనుమంతుడు. భగవంతుని యందు భక్తి ఏ విధంగా ఉండాలి అన్నది హనుమంతునినుండే నేర్చుకోవాలన్నారు ఋషులు. భగవద్భక్తికి ఆయనే ఆదర్శం.
సుగుణ సంపన్నుడు, కరుణాలవాలుడు అయిన ఆంజనేయుని ఉపాసించుటవలన మనిషికి ఇహ-పర సుఖాలు రెండూ సమంగా సిద్ధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తున్నది.
నవవిధి భక్తి మార్గాలలో దాసభక్తి ఎంతో గొప్పది. భక్తుడైనవాడు సర్వకాల సర్వావస్థలలోను భగవంతునికి ఏదో ఒక విధమయిన సేవ చేస్తూంటాడు. దాసభక్తుడు తాను చేసే ప్రతి శుభా శుభ కార్యాలన్నింటినీ భగవంతునికే అర్పిస్తాడు. ఆయనను ఎడబాయకుండా సేవిస్తాడు. ఏ పనిచేసినా, ఏమితిన్నా భగవంతుని ఉద్దేశించి మాత్రమే చేస్తాడు. వారికి సొంతమనేది ఏదీ ఉండదు. భగవంతునికి అనుకూలమైన కార్యకలాపాలు చేస్తాడు. ప్రతికూలమైన వాటిని విడిచి పెడతాడు.
అటువంటి దాస్య భక్తిలో పరిపూర్ణుడై భగవంతుని అనుగ్రహం పొందిన వారిలో ఆంజనేయుడు మొదటివాడు.నిరంతరరామనామ సంకీర్తనా పరుడు కనుకనే రామభక్తులలో ఆయన కొక్కనికే పూజార్హత లభించింది. సాక్షాత్తు పరంధాముని కన్నా ఆంజనేయుని భక్తులను, దాసులను, దాసానుదాసులను ఆశ్రయిస్తే త్వరగా ముక్తి దొరుకుతుందని ఓ తత్త్వం చెబుతున్నది.
ఆంజనేయుడు రుద్రుని అవతారం. శంకరుడు వానర రూపం ధరించడానికి గల కారణాలు పురాణాలలోను, రామాయణ మహాకావ్యంలోను విశదంగా వివరింపబడి ఉంది. శ్రీరాముడు శివభక్తుడు. శివునికి శ్రీరాముడు ఉపాస్య దైవం. ఇష్టదైవం కూడా. నారాయణుడు నరుడై శ్రీరామునిగా అవతరించాడు.
సీతమ్మవారి జాడ కనుగొనేందుకై వెళ్లిన హనుమంతుడు లంకనుండి తిరిగి వచ్చాడు. వెళ్లిన కార్యం ఏమైందో ఏమో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఎదురు చూస్తూ నిలబడ్డ సుగ్రీవ, జాంబవంతాదులను చూడగానే ‘చూచితి సీతన్’ అనే ఐదక్షరాల అమృతపదం పలికాడు. తన వాక్చాతుర్యంతో సీతమ్మను, శ్రీరామచంద్రుని ఆకట్టుకుని రామచంద్రమూర్తికి ఎంతో ఇష్టుడయ్యాడు. నమ్మిన బంటు గా అయ్యాడు. రామబంటుగా పేరొందాడు.
శంకరుడు ఈ నర రూపానికి భక్తుడిగా కొనసాగాలంటే వానర రూపం ఎత్తడమే ఉత్తమ మార్గంగా ఎంచుకున్నాడు. ఈ విషయం గోస్వామి తులసీదాసు తమ దోహావళి, వినయపత్రిక గ్రంథ రచనల్లో వివరంగా తెలియజేశాడు.హనుమంతుని బుద్ధి కుశలత, పరాక్రమాలు తెలుసుకున్న శ్రీరామచంద్రుడు ఆనంద పరవశుడై తనే ఓ అడుగు ముందుకు వేసి హనుమంతుని గాఢంగా కౌగలించుకుని ‘నాకిప్పుడు ఇతడే సర్వస్వం’ అంటూ అక్కడున్న వారందరితో అన్నాడు.శ్రీరామచంద్రుని ఆలింగనం పొందిన భాగ్యశాలిగా, కార్యశూరునిగా, జ్ఞాన నిష్ఠునిగా, భక్త శిఖామణిగా, భవిష్యత్ బ్రహ్మగా, చిరంజీవిగా ఉండిపోయిన హనుమంతుడిని భక్త్భివంతో పూజిస్తే జన్మ ధన్యమవుతుంది.

- శివప్రసాద్