Others

మనలను మనం సమీక్షించుకుందామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలంలో నలుగురితో కలసి కూర్చుని మాట్లాడుకునే సమయం లేదు. ఉమ్మడి సంసారాలు లేవు. పిన్న పెద్ద తేడాల్లేకుండా పరుగెత్తడమే జీవన యానంగా ఉంటోంది. అయతే కాస్త ఆలోచిస్తే ఏదైనా చేయగలం. ఆ ఆలోచించడానికి కూడా సమయం లేదు అనుకొంటూ ముందుకు పోతున్నాం అనుకొంటున్నాం. కాని అన్నీ ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్నాం. మన దగ్గర ఉన్న యంత్రాలు ఒకసారి లేకుండా పోతే ఏం చేస్తాం. ప్రతికూల పరిస్థితులు వస్తే ఏం చేస్తారు. ఒకరుగా ఉండడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కాని అన్ని పనులు ఒక్కరే చేయలేరు. మరొకరి సాయం అవసరం అవుతుంది. అందుకే పెద్దవాళ్లు నలుగురితో కలసి ఉండాలోయ్ అన్నారు. మరి ఆ నలుగురితో కలసి పనిచేయాల్సి వస్తే ఇబ్బంది లేకుండా ఎవరికి వారు నేను పని చేయగలను అని అనుకోగలరా అట్లా అనుకున్నది ఎంత నిజమో ఈ నాలుగు విషయాలు తరచి చూచి నిర్ణయంచుకోండి.
ఏ పని చేయాల్సి వచ్చినా నలుగురితో ఆలోచనలు పంచుకుని వారిలో ఒకరుగా కలిసి పని చేయగలను.
ప్రతికూల పరిస్థితుల్లోను బాధ్యతలను స్వీకరిస్తాను. వాటిని నేను సానుకూలంగా మార్చుకోగలను.
విజయం నాకు మాత్రమే సంబంధించినదైనా ఆ విజయ విశేషాలను ఇతరులతో పంచుకోగలను. ఏ పనిలోనైనా వెనుకడుగు వేస్తే మళ్లీ లక్ష్యాలు ఏర్పరచుకుని సాధించేందుకు కృషి చేస్తాను. తిరోగమనం కాకుండా పురోగమించడానికి నలుగురి సాయం తీసుకోగలను. నా మీద నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. నేను సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాను. విమర్శలనైనా స్వీకరించి వాటికి జవాబు చెప్పగలను.
సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయాలు వెదుకుతాను. సమస్యా పరిష్కారానికి నాకన్నా తక్కువ వారి దగ్గరకు వెళ్లాల్సి వచ్చినా, పెద్దవారి దగ్గరకు వెళ్లాల్సి వచ్చినా జంకు లేకుండా వెళ్లి మాట్లాడగలను. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోను మోసం చేయను. ఒకవేళ నష్టమే మళ్లీ వచ్చినా సత్యానే్న పలుకుతాను. ధర్మానే్న ఆచరించగలను. లేదు, కాదని నిర్మొహమాటంగా చెప్పగలను. సమూహాన్ని ప్రభావితం చేయగల నేర్పు నాలో ఉందని బలంగా నమ్ముతున్నాను. నాలో ఉన్న లోపాలను, ఇతరుల్లోని గొప్పదనాన్ని గుర్తించగలను.
ఇతరుల మాటల్ని పూర్తిగా వినగలను.
మిత్రులు, కుటుంబ సభ్యులే కాకుండా కార్యాలయంలో కూడా నన్ను ధైర్యవంతుడంటుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో చిన్న మార్గం దొరికినా అంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండగలను.
పై లక్షణాలు మీలో ఎన్ని, ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలించాలి. లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. సానుకూల దృక్పథం అభివృద్ధి పరచుకోవడంలో మనలను మనం పరిశీలించుకోవడం అవసరం. మన మానసిక స్థితిని మనమే సందేహం లేకుండా అంచనా వేసుకోగలగాలి. స్వీయ గౌరవం పెంపొందించుకోవాలి. పరిపూర్ణ వ్యక్తిత్వం, ఆరోగ్యం పెంపొందించుకోవాలి. అవసరాన్ని బట్టి మార్పును స్వీకరించాలి. దేనినైనా అతిగా ఊహించుకోవడం మంచిది కాదు. ఎక్కు వ కోపం కాని, అతి మంచితనం కాని పనికిరాదు. పరిస్థితులను బట్టి మెలిగే సామర్థ్యాన్ని స్ర్తి పురుష తేడా లేకుండా దృఢతరం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ ఉంటే తొందరగా మార్పులను స్వాగతించడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఉన్నంతలో తృప్తి చెందడం, అవసరమైనదానిని సాధించడం నేర్చుకోవాలి. అవరోధాలను అవకాశాలుగా స్వీకరించి సాగిపోవాలి.