Others

ఆమె నవ్వింది .. గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామం: కాదు పిన్నీ! మధ్యాహ్నం బాబాయ్‌తో ఏదో చెపుతున్నావ్? ఏదో నా ఉద్యోగం గురించి?
కమల: చెప్పకపోతే బతుకు తెల్లారడం ఎలాగ? ముప్పూటలా నిన్ను మేపటానికి ఏదైనా రూపాయల చెట్టుందా ఏం? బియ్యే పాసయి అప్పుడే రెండు నెలలయింది. యిలా యింకెన్నాళ్ళు అడ్డగాడిదలా తిరుగుతావ్?
రా: అందుకేగదా నేను పట్నం వెళతాననన్నది పిన్నీ!
కమల: అదీ వరస! ఇహనేం! మేసినన్నాళ్ళు మేశావు. రక్తం ఓడ్పించి చదువుకున్నావు. రెక్కలొచ్చాయి- పారిపోతానంటావు. అంతేనా?
రా: నువ్వు అలా అంటే నేనేం చెప్పను? నా ఉద్దేశం అది కాదు. నాకాబళ్లో మేష్టరీ ఉద్యోగం చెయ్యాలని లేదు పిన్నీ!
కమల: మరి? గాడిదల్ని కాయాలని ఉందా?
రా: నేను నినే్నం పెద్ద కోరిక కోరడంలేదు. పెంచావు, పెద్దవాణ్ణి చేశావు, చదువూ చెప్పించావు. అందుకు ఆజన్మాంతం నీకు కృతజ్ఞుణ్ణి. కాని..
కమల: కాని..
రా: నా కలలు వేరు పిన్ని! నాకేవో మనస్సులో ఆశయాలున్నాయి. ఏవేవో చేద్దామని ఉంది. ఫలానా అని చెప్పలేను.
కమల: అక్కర్లేదు. నాకేం చెప్పక్కర్లేదు. ఏమో నాయనా.. నీ యిష్టం! ఆనక మీ బాబయ్యగారి యిష్టం. నేనెవత్తని మధ్య!
రా: అలా అనకు పిన్నీ! నీ మాట ఎప్పుడైనా కాదన్నానా నేను?
కమల: అయితే స్కూలులో హాయిగా మేష్టరుగా చేరు.
రా: నీ యిష్టం పిన్నీ!
***
కమల: రామం!
రా: ఏం పిన్నీ?
కమల: ఈ నెల జీతంలో ఏం ఖర్చుపెట్టకు సుమా, కిందటి నెలలాగ!
రా: మా హెడ్మాష్టరు కూతురికి పెళ్లి పిన్నీ. అందరం చందా వేసుకుని ఏదైనా కొనివ్వాలని అనుకుంటున్నాం.
కమల: అనుకుంటారు, అనుకుంటారు. బుద్ధి లేకపోతే సరి! ముందు నీ పెళ్లి సంగతి చూడు! తరువాత ఊరి బాబుగాళ్ళ పెళ్లిలో పెత్తనం చెలాయిద్దురుగాని. రేపు మా అన్నయ్య వస్తున్నాడు పసుపూ కుంకుమ ఇవ్వడానికి.
రా: పసుపూ కుంకుమా? ఎవరికి?
కమల: మరెవరికి? నీ మొహానికే. మా అన్నయ్య కూతురు వెంకటమ్మని నీకిచ్చి పెళ్లి చెయ్యడానికి నిశ్చయం అయిపోయింది.
రా: అదెలా కుదురుతుంది పిన్నీ? ఒక్కమాటేనా నాతో అనకండా..
కమల: ఏం? నీ మంచి చెడ్డలు మాకామాత్రం తెలియదనుకున్నావా? నానా అవస్థా పడి నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి రక్తం ఓడ్చి చదువు చెప్పించి..
రా: నువ్వలా అంటే ఇంక నేనేం చెప్పను? పెళ్లంటే మాటలా? బతికున్నన్నాళ్ళూ అనుభవించవలసిన విషయం.
కమల: అందుకే ఆలోచించి వెంకటమ్మని నిశ్చయించాం. దానికేం తక్కువ? లక్షణమైన పిల్ల. కన్ను గుడ్డా, కాలు కుంటా?
రా: అలా అడిగితే నేను చెప్పలేనుగాని, నాకీ సంబంధం ఇష్టంలేదు. నాకసలు పెళ్లి చేసుకోవాలని లేదు ఇప్పుడప్పుడే.
కమల: (వ్యంగ్యంగా) అవును పాపం! పదహారేళ్ల బాలాకుమారుడివి! నాకు తెలుసులే. మీ వంశమే అంత. గాడిద కడుపున సింహం పిల్ల పుడుతుందా? మీ నాన్న కొడుకువి నువ్వూ-
రా: చచ్చి స్వర్గానున్న ఆయనె్నందుకు అనుకోవడం పిన్నీ!
కమల: (కోపంగా) నా ఇష్టం వచ్చినట్లు అంటాను. నువ్వెవడివి నన్ను అదుపులో పెట్టడానికి?
రా: జీవితంలో ఇంకో ప్రాణిని తీసుకొచ్చి దాని బాధ్యతనంతా వహించి-
కమల: నాకీ మెట్ట వేదాంతాలు పనికిరావు తెలిసిందా? ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెపితే లొంగే ఘటాన్ని కాదు. రుూ పెళ్లి జరిగి తీరవలసిందే. వినబడిందా?
రా: వినబడింది. పిన్నీ.. నీ ఇష్టం..
***

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)