Others

ఆమె నవ్వింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై: ఆఁ.. దేనికంత ఆశ్చర్యం? నేనూ మీలాగే గ్రాడ్యుయేట్‌ని.
రా: మంచిది స్టేషను వస్తోంది దిగిపోతాను. దయుంచండి.
వై: వెళ్లిరండి (విరగబడి నవ్వుతుంది)
***
తండ్రి: అమ్మాయ్!
వైదేహి: ఏం నాన్నా!
తండ్రి: ఇవాళ ఆఫీసుకి వెళతావా?
వై: వెళ్ళను వెధవ ప్రయాణం కాదుగాని, ఒళ్ళంతా నొప్పులు. ఏం బాగాలేదు. ఇవాళకి సెలవు పెట్టేస్తాను.
తండ్రి: అలాగే చెయ్యి. నాకూ అలాగే వుంది. కాని సెలవు లేదు. వెళ్ళక తప్పదు.. రాత్రి బండిలో సరిగ్గా నిద్రపట్టలేదే అమ్మాయ్! అసలే నల్లులు, పైపెచ్చు నువ్వు వాడెవడో ఆ జేబుదొంగతో ఊకదంపుడు ఖాతాఖానీలోకి దిగావు.
వై: (నవ్వుతుంది) నువ్వు మరీ నాన్నా! ప్రతివాడూ జేబుదొంగే అంటావ్ నువ్వప్పుడు నిద్రపోయావనుకున్నాను, మేలుకొనే ఉన్నావా?
తండ్రి: అది నిద్రా కాదు, మెళకువా కాదు. ఏమిటో మగత. మీ మాటలన్నీ లీలగా వినబడుతూనే ఉన్నాయి. ఏమంటాడు వాడు?
వై: ఏవిటో పాపం, వెర్రివాడు, ఉత్త ఓబయ్య, చచ్చిపోదాం అనుకున్నాట్ట
వాసంతి: (ప్రవేశిస్తూ) చచ్చిపోవడం ఎవడే అక్కయ్యా?
వై: అదేమిటి వాసంతీ? నువ్వింకా కాలేజీకి వెళ్లలే?
వాసంతి: లేదక్కయ్యా! ఏవిటో ఒళ్ళు బద్ధకంగా వుంది ఇవాళకి మానేస్తాను.
వై: బాగుందే వరస. ఇలా చీటికీ మాటికీ కాలేజీ మానస్తే యిక చదువు అబ్బినట్లే.
తండ్రి: అదంతేలే. మొండిఘటం. దాని బుద్ధికి ఎంత తోస్తే అంతే. టైమైంది. నేను వెళ్ళొస్తాను. ఇద్దరూ ఇంట్లోనే ఉంటారుగా?
వాసంతి: ఆ.. మీరు వెళ్లిరండి నాన్నా! చెప్పవే అక్కయ్యా! ఎవడా చచ్చిపోదాం అనుకున్నవాడు?
వైదేహి: ఎవడేంటే నేనేం చెప్పను? పేరు రామారావు, బియ్యే పాసయ్యాడు ఉద్యోగం లేదు. పెళ్ళాం గయ్యాళి.. అంచేత రైలు కింద పడిపోదాం అనుకున్నాడు. అంతే సంగతి.
వాసంతి: పడిపోయాడా?
వై: లేదు ఏం?
వాసంతి: పడితే గమ్మత్తుగా ఉండును. ఇన్నిసార్లు ప్రయాణం చేశాను గాని నేనున్న రైలు కింద ఎవ్వడూ ఒక్కసారీ పడలేదే?
వై : ఏడిశావు- వెధవ కోరికలూ నువ్వూనూ! ఒకళ్ళ బాధ నీకు సరదాగా వుంటుందా?
వా: ఏవిటో, రోజులు బొత్తిగా చప్పగా గడుస్తున్నాయి కాలేజీకి వెళ్లడం, రావడం, తిండి తినడం, నిద్రపోవడం- ఇంతేనా జన్మ?
వై: నిండా ఇరవైయ్యేళ్ళు లేవు చూస్తే- అప్పుడే నీకు ఇంత అసంతృప్తి ఏవిటే వాసంతీ!
వా: ఏం చెప్పను మరి? మొత్తంమీద నాకేమిటో బాగులేదు ఏదో చేసేద్దామని ఉంది.
వై: నీ వయస్సులో అందరికీ అలాగే వుంటుంది. తెలివితేటలు చాలించి కాస్సేపు నీ పని నువ్వు చూసుకో. నేను గదిలోకి పోయి పడుకుంటాను. రాత్రల్లా ప్రయాణంలో నిద్రలేదు.
వాసంతి: ఒక్క మాట చెప్పేసి వెళ్లిపో! వాడికెనే్నళ్ళుంటాయ్?
వై: ఎవడికి?
వా: వాడికే- రామారావో ఏదో అన్నావ్, వాడికి?
వై: వాడి గొడవెందుకిప్పుడు?
వా: ఊరికేనే.
వై: ఉంటాయి పాతికేళ్ళు లేక ముప్ఫయుంటాయో- ఎవరికి తెలుసు?
వా: చూడ్డానికి బాగుంటాడా?
వై: ఏం చెప్పను? దీపాల కాంతిలో బాగున్నాడు. వెనె్నల కాంతిలోనూ బాగున్నాడు. పగటివేళ నేను చూడలేదు మరి.
వా: ఐతే, పగటి కాంతిలోనూ బాగనే ఉండుంటాడు.
వై: అలా చెప్పలేం. కొన్ని కొన్ని వస్తువులు దీప కాంతిలో ధగధగా మెరిసిపోతాయి. తెల్లవారి చూసేసరికి పేలవంగా అసహ్యంగా వుంటాయి. ఇంక నన్ను సతాయించకు.. వెళ్ళు. ***