Others

జన్మ పరంపర - గుణ పరంపర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం కనుక్కుంటాను అని తన కపిలవస్తు రాజ్యాన్నుండి బయలుదేరి అనితర సాధ్యమైన శ్రద్ధతో - సహనంతో నాలుగు ఆర్య సత్యాలు మరి అష్ఠాంగ మార్గంతో కూడిన ‘ఆత్మ జ్ఞాన ప్రకాశం’తో తన అవిద్యను దూరం చేసుకున్న సిద్దార్థ గౌతముడు బుద్ధుడయ్యాడు.
ఇలా నిరంతర ధ్యాన యోగ సాధన వల్ల మాత్రమే ఆత్మతత్త్వం అవగతమై.. మన ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం దూరం అవుతుంది. మరి ఒక బుద్ధుడిలా చేయవలసిన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది.
‘తపస్వి బ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః
కర్మిభ్యశ్చ్ధాకో యోగీ తస్మాద్యోగీ భవార్జున’ (్భగవద్గీత॥ 6-46)
ఒకానొక యోగి తాపసులకంటే శ్రేష్ఠుడు. శాస్త్ర జ్ఞానుల కంటే శ్రేష్ఠుడు.
సాత్విక కర్మల నాచరించేవారి కంటే శ్రేష్ఠుడు. కనుక ఓ అర్జునా! యోగివికా! అని సూచించాడు శ్రీకృష్ణుడు.
మానవ ‘జన్మ పరంపర’ అనేది ఒక అద్భుతమైన విషయం. ఈ జన్మ పరంపర చివరి స్థితుల్లోనే మానవుడు జ్ఞానవంతుడు అవుతుంటాడు, ఎన్నో జన్మలు మానవుడిగా జన్మించిన తర్వాత! తొలి జన్మలలో తన శరీరం కోసమే జీవిస్తుంటాడు. తినడం, తాగడం, నిద్రించడం, మైథునం, పెళ్లి, పిల్లలు, మళ్లీ వాళ్ల అనారోగ్యాలు, పెద్ద వాళ్ల బాధ్యతలు, కుటుంబం కోసం ఆరాటం, పోరాటం, ఇల్లు, పిల్లల పెళ్లిళ్లు - ఇలా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కోసమే ఎన్నో జన్మలు తీసుకుంటాడు. చనిపోతాడు. మళ్లీ భౌతిక శరీరంతో పుడతాడు. మళ్లీ మళ్లీ అనేక చోట్ల పుడుతుంటాడు. జీవహింస చేస్తుంటాడు. ఇది ‘తమోగుణం’
ఇలాగా ఒక వందో నూట యాభయ్యో, రెండు వందలో ఎన్నో జన్మలు అయిపోయిన తర్వాత, కేవలం తినడానికే పుట్టకుండా ‘నేను ప్రజల్లో గుర్తింపు పొందాలి; నేనొక రారాజును కావాలి. నేను అందరిలో ప్రథమ పౌరుడిని కావాలి; నా తర్వాతే అందరూ ఉండాలి; అందరూ నా కాళ్లకే మ్రొక్కాలి, ప్రక్కవాల్లకు మ్రొక్కకూడదు’ అని చెప్పేసి అధికార వాంఛలతో ఉంటాడు. దానికై పోరాడతాడు. ఇది ‘రజోగుణం’
మొదటి వందా రెండు వందల జన్మల్లో తమోగుణంతోనూ, ఆపైన మరొక నూరు జన్మల్లో ‘రజోగుణం’తోనూ ఉంటాం మనం. ఒక్కొక్క మనిషీ ఒక్కొక్క గుణంతో కొన్ని వందల జన్మలు తీసుకుంటాడు. అందులో ఎన్ని జన్మలు ఏయే గుణానికి కేటాయించాడు అన్నది ఆ ఆత్మయొక్క ‘ఇచ్ఛా, స్వేచ్ఛ’ల మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మపరిణితి పైన ఆధారపడి ఉంటుంది.
ఆ విధంగా ‘రజోగుణ’ పరంపరలో కొన్ని జన్మలు పూర్తయిన తర్వాత, అపుడు నేనేం చేయాలి? జీవితం ఆనందంగా వుండాలి అంటే ఏం చేయాలి? అని ఆలోచించడం ప్రారంభిస్తాడు. తమోగుణంలోనూ, రజోగుణంలోనూ ఎన్నో కష్టాలు అనుభవించి, అనుభవించీ ఇక బాధలు అనుభవించకూడదు అన్న జ్ఞానం మెల్లిగా అంకురించడం మొదలవుతుంది; అదే సాత్విక గుణం.
‘బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే’ అని శ్రీకృష్ణుడు వచించాడు గీతలో. ఎన్నో జన్మల తరువాత మానవుడు జ్ఞానవంతుడు అవుతాడు అని. భోగలాలసతతో కొన్ని జన్మలూ, అధికార లాలసతతో మరికొన్ని జన్మలూ పూర్తయిన తర్వాత ఈ సాత్విక గుణ పరంపర - సత్య లాలసత మొదలవుతుంది.
దాని కోసం భక్తి యోగంలోకి మొదట అడుగిడతాడు.
ఆపైన జ్ఞాన యోగానికి తదుపరి రాజయోగానికి ఆత్మ ప్రయాణం మొదలవుతుంది. రాజయోగమే ధ్యానయోగం! ధ్యానం అంటే - ధీ అంటే ఆత్మతో - యానం అంటే ప్రయాణం!
-సశేషం
(బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాల సంకలనం మరి ఓషో సందేశాల నుండి)

-మారం శివప్రసాద్