Others

అంతా మనమనుకొన్నట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా చీకటి ఆవరించినా
మనసున్న మనిషి లోపల
జాగృతికే ఆహ్వానం పలుకుతుంది

జగమంతా జడివాన కురిసినా
తడియారని మనసు
ప్రతి క్షణమూ అంకురిస్తూనే ఉంటుంది

అన్నీ ముళ్లపొదలే ఎదురైనా
మనసునున్న మల్లె గుబాళిస్తూనే ఉంటుంది

చిమ్మ చీకట్లు కమ్ముకున్నా
లోన వెలుగు విప్పారుతూనే ఉంటుంది.
అంతా మనమనుకొన్నట్టే సాగుతుంది
ఏదైనా ఎప్పుడైనా
అందుకే కొత్త ఆలోచనలకు నారు పోద్దాం.
కొత్త సాగుకు విత్తనాలు చల్లుదాం .

- చరణశ్రీ 7799456259