Others

మనస్సు - చిత్తం - బుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం రాజులు, మహారాజులు, చక్రవర్తులు కూడా తాము ఏ వర్ణం వారైనా కూడా తమ ప్రధానమంత్రులుగా బ్రాహ్మణ శ్రేష్ఠులనూ, సైన్యాధిపతులుగా క్షత్రియ శ్రేష్ఠులనూ, కోశాధికారులుగా వర్తక శ్రేష్ఠులనూ నియమించుకునేవారు. అలా నియామకం చేసే ముందు వారికి కఠిన పరీక్షలు పెట్టి ఉత్తీర్ణులైన వారిని మాత్రమే తీసుకునేవారు.
బుద్ధి, వివేకం, ఆలోచన, కార్యదక్షత, మంత్రాంగ, సమయజ్ఞత, నేర్పు, రాజకీయ చతురత, నియామక ప్రతిభ గల బ్రాహ్మణ శ్రేష్ఠుడిని ప్రధానమంత్రిగా నియమించుకునేవారు. వేదం, శాస్త్రాలు, కళలు, విద్యలు బ్రాహ్మణులకు స్వంతం అన్నట్లుగా అలవడేవి.
ధైర్యం, సాహసం, రక్షణ, నిర్భయం, చొరవ, తెగింపు, అస్తశ్రస్త్ర విద్యలు, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడడం - ఈ లక్షణాలు రక్తంలోనే ఉంటాయి క్షత్రియులకు. అందుకే సర్వ సైన్యాధిపతిగా క్షత్రియులను నియమించుకునేవారు.
వ్యవహారం, బాధ్యత, లెక్కలు (గణితం), తెలివి, సమయస్ఫూర్తి, క్రమశిక్షణ, డబ్బు పట్ల అమిత జాగ్రత్త, ఇచ్చిపుచ్చుకోవడంలో చేవ్రాలు, మహారాణితోనైనా రశీదు వ్రాయించుకుని డబ్బు ఇవ్వడం ఈ దక్షతలో నేర్పరులు వైశ్యులు. కనుక వైశ్య శ్రేష్ఠులనే కోశాధికారిగా నియమించుకునేవారు.
ఇక మిగిలిన వారు - మిగిలిన పనులలో ఏ పని ఎవరికి సామర్థ్యముంటే వారిని నియమించేవారు. అపుడు ఆ కాలంలో వృత్తినిబట్టి వర్ణాలు ఏర్పడ్డాయి తప్ప కులాలను బట్టి వృత్తి కాదు. జన జీవనం సాఫీగా సాగడానికి ఉత్తములైన రాజులు ఈ విధంగా ప్రవర్తించేవారు.
నిర్ణయాలు మాత్రం తామే తీసుకునేవారు శ్రేష్ఠులైన రాజులు!
కథలోని రాజులాగే ఎందరో నోరు జారుతుంటారు - తిప్పలు పడతారు. ముప్పులు తెచ్చుకుంటారు. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత పశ్చాత్తాప పడతారు. పెదవి దాటితే పృథ్వి దాటినట్లే.
‘మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు’ అన్నారు బ్రహ్మర్షి పత్రీజీ.
‘వాక్కులోనే జనగము వర్థిల్లుచుండును’ అన్నారు వేదవ్యాసులవారు.
ఈ ప్రపంచమంతా ‘మాట’ మీదనే నడుస్తుంది. కనుక కాపాడుకోవలసింది మన మాట. దానివల్ల జీవితం బాగుంటుంది - అది జ్ఞానం!
మనిషి ప్రాణాలు శ్వాస వల్లనే నిలుస్తాయి. కనుక శ్వాసలను కాపాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆయుష్షు పెరుగుతుంది - అది ధ్యానం!
చాలామంది తొందరపడి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. వాగ్దానం అంటే వాక్కుదానం.
అది ప్రమాణమే! అది అప్పు కింద లెక్క. సత్యహరిశ్చంద్రుని కథ మనకు తెలుసు. అలాగే అదే రఘువంశ చక్రవర్తులలోని శ్రీరామచంద్రుని గురించి కూడా మనకు తెలుసు.
మనం మాట కాపాడుకోవడం కోసం వారిలా మనం అంత గొప్ప త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హరిశ్చంద్రునితో చెపుతాడు. నువ్వు నాకు కలలో వాగ్దానం చేసావు. ఆ వాగ్దానం తీర్చమని. హరిశ్చంద్రుడు అంటాడు కదా - బ్రహ్మర్షివర్యా! మీరు చెప్పారంటే అది కలైనా సత్యమే అవుతుంది. మీ మాటకు నేను బద్ధుడిని అని తన జీవితానే్న ఫణంగా పెడతాడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి! అందుకే ఆయనను సూర్య చంద్రులు ఉన్నంతకాలం సత్యహరిశ్చంద్రునిగా కీర్తిస్తున్నాం.
అలాగే పినతల్లికి తన తండ్రి ఇచ్చిన మాట కోసం పధ్నాలుగు సంవత్సరాలు భార్య, తమ్ముడితో సహా వనవాసం చేస్తాడు శ్రీరామచంద్రుడు. ఒక చాకలివాడు తనను, సీతాదేవిని నిందించిన మాటను కూడా భరించలేక, ప్రజావాక్యం కోసం నిండు చూలాలిని అరణ్యాలకు పంపుతాడు శ్రీరాముడు.
కనీసం మనం మనకోసమైనా మన జీవిత అభ్యుదయం కోసమైనా తొందరపడి మాట్లాడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరూ ఎవరినీ కాపాడలేరు. ‘ఉద్ధరేత్ ఆత్మనాత్మానాం’ అన్నారు శ్రీకృష్ణులవారు.
చక్కగా మాట్లాడడం ఒక కళ. అందుకు బాగా వినడం ప్రాక్టీస్ చేయాలి. బాగా వినాలంటే అంటే అర్థం శ్రద్ధగా వినాలి అని. చాలామంది ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగానూ వినరు - పూర్తిగానూ వినరు. ధర్మరాజు గ్రేట్ లిజనర్. దుర్యోధనుడు గ్రేట్ లిజనర్. శ్రీకృష్ణుడు గ్రేట్ లిజనర్. బాగా వింటేనే బాగా మాట్లాడగలం.
బాగా వింటేనే చక్కటి నిర్ణయాలను తీసుకోగలం. ఆలోచించే మనస్సుకూ నిర్ణయం తీసుకునే బుదిధకి మధ్య చంచల స్థితి అయిన చిత్తమే నోటిని అదుపు లేకుండా చేస్తుంది. అందుకే ధ్యాన యోగంతో చిత్తవృత్తి నిరోధం చేయాలి.
ధ్యానం ద్వారా జ్ఞానం! జ్ఞానం ద్వారానే ముక్తి!
నోటిలోని వౌనమూ - మనసులోని శూన్యమూ దాని పేరు ధ్యానము!
మాటలోని సత్యము - మాటల్లోని ఎరుక దాని పేరు జ్ఞానము!
ధ్యానం చేద్దాం - ధన్యులమవుదాం.

-మారం శివప్రసాద్