Others

పాటల పల్లకిలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెక్క సాచిన ఊహలు
(గేయసంపుటి)
-డా.వోలేటి పార్వతీశం
వెల: రూ.150
పే. 112
కినె్నర పబ్లికేషన్స్,
హైదరాబాద్-13
ప్రతులకు: 98660 57777
*
భావగీతాలు, లలిత గీతాలను ఒక ప్రత్యేక విభాగంగా అభివృద్ధి పరిచి ‘ఆకాశవాణి’ వారు విస్తృత ప్రచారమొనర్చి శ్రోతల ఆదరణను చూరగొన్నారు. దూరదర్శన్ కూడా ఆకాశవాణి అడుగుజాడలలో లలిత సంగీతాన్ని ప్రసారం చేస్తున్నది. దీనివల్ల ఎంతోమంది కొత్త గాయనీ గాయకులు, సంగీతకారులు వెలుగులోకి వచ్చారు. విశేష ప్రజాదరణ పొందిన లలిత గీతాలు సినిమాల్లోకి కూడా ప్రవేశించగలిగాయి.
కవిత్వం రాసే ప్రతి ఒక్కరూ గేయాలు రాయలేరు. సాహిత్య జ్ఞానం, స్వరజ్ఞానం కలిగి వున్నవారు మాత్రమే మంచి గేయ రచయితలుగా రాణించగలం. ఒక పాట హిట్ కావడం వెనుక గీత రచయిత, స్వరకర్త, గాయకుడు ముగ్గురి శ్రమ ఉంటుంది. ముందుగా కవి కలం ద్వారా పాట ప్రాణం పోసుకుంటుంది. ఆ పాటలోని శైలి, లయ, కవితా ధోరణులను బట్టి ఆ కవి ఎవరో గుర్తించవచ్చు. లలిత సంగీతంలో భావకవిత్వపు ధోరణులు అన్నీ కలగలసిపోయాయి. ప్రణయ కవిత్వం, ప్రకృతి కవిత్వం, భక్తి కవిత్వం, దేశభక్తి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వం, స్మృతి కవిత్వం - ఇవన్నీ భావ కవిత్వపు ధోరణుల్లో భాగమే. ఈ ఇతివృత్తాలతో కూడిన కవిత్వమే డా.వోలేటి పార్వతీశం రచించిన ‘రెక్కలు సాచిన ఊహలు’ గేయ సంపుటిలో చోటు చేసుకున్నాయి. ఋతువులకు సంబంధించిన గేయాలు, పండుగలు, దేశభక్తి, ప్రబోధాత్మక గేయాలు ఎక్కువగా రాయడం వృత్తి నిర్వహణలో భాగంగా కావచ్చు. ప్రేమ, విరహం, వియోగంలతో కూడిన ప్రణయ కవిత్వమున్నది. ‘పొడిచే ప్రతి పొద్దు అది నీలాగే తోస్తున్నది/ కలిసేందుకు దారిలేక జ్ఞాపకమై పూస్తున్నది’ అనే భావన హృదయానికి హత్తుకుపోతుంది. బయో-డేటాలో ఎక్కడా తన మూలాలు తెలియకుండా ఎంతో జాగ్రత్త పడిన కవి ‘ఓరుగల్లు ప్రాభవం’ అనే గేయం రాయడం ఒక విచిత్రం. కాకతీయ సామ్రాజ్య వైభవాన్నంతా ఈ చిన్న గేయంలో పొదిగిన తీరు బాగుంది. ఎక్కడా పేరు చెప్పకుండా శ్రీకృష్ణ దేవరాయల మీద రాసిన గేయం కవి ప్రతిభకు తార్కాణం. వ్యక్తిత్వం గురించి, చదువుల ఆవశ్యకత గురించి తెలియజేసిన ప్రబోధాత్మక గేయాలను ప్రచారానికి వాడుకోవచ్చు. ముఖ్యంగా కల్తీసారా తాగవద్దని హెచ్చరించే ‘ఓ మంచి మాట’ గేయాన్ని తెలంగాణ మాండలికంలో రాయడం విశేషం. లయాత్మకమైన పదాల పొందికతో వున్న ఈ గేయాలను, ఎవరైనా సరే హాయిగా తమకిష్టం వచ్చిన విధంగా పాడుకునే సౌకర్యం ఉంది. పాటలలోని సాహిత్యాన్ని విశే్లషించి వివరించడం వేరు. ఆ పాటలను విని ఆనందించడం వేరు. అందుకని విని ఆనందించే అవకాశం కోసం ఎదురుచూద్దాం.

-కె.పి.అశోక్‌కుమార్