Others

తూరుపు వెలుగులో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలిమంచు చీరలో పచ్చని ప్రకృతి
భూకాంతను రోజూ
కొత్తగా చూసే చెలికాడిలా
కొండలచాటు నుంచి
ఉదయించే సూరీడు
చెట్టుకొమ్మల్లోంచి సుతారంగా
నేలను తాకే తొలి కిరణాలు
చెరువు గట్టు మీంచి వీచే చల్లని గాలి
రావి ఆకుల గలగలలు
దూదిపింజలు పొదిగిన నీలాకాశం
బడికి వెళ్లే పిల్లల్లా పక్షుల బారులు
విశాలమైన సంద్రంలో
ఎగసి ఎగసిపడే
ఆశల కెరటాలు
మింటి నుంచి పాలధారలా
పండు వెనె్నల
మిలమిల మెరిసే తారకలు
వేసవి తాపం మరిపించే
సాయంత్రపు మల్లె పరిమళం
రాధామాధవి పందిరి కింద
వెచ్చని శీతాకాలపు రాత్రులు
పెరట్లో ఎర్రని
మందారాల మందహాసాలు
రాలిన పారిజాతాలు
చిన్నారి పాపల బోసినవ్వులు
ప్రపంచమంతా ప్రేమించే మనసులు
కల్మషం లేని హృదయాలు
మోసం తెలియని మనుషులు
ఆపదలో ఆదుకునే మానవత్వం
మనిషికి మనిషి ఆసరా
కృతజ్ఞత చూపే మనిషితనం
ఎన్ని కొత్త కాంతులో
అనుకుంటూ మేల్కొన్న
ఎంత మంచి కల!!
*

-లక్ష్మిమైథిలి ములుగు