Others

పిల్లలకు బంగారు కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యామందిరం (పిల్లల నవల) -అనూరాధ సుజలగంటి
వెల: రూ.50 దొరుకు స్థలం: అన్ని పుస్తక కేంద్రాలు
జ్యోతి వలబోజు -8096310140
అనూరాధ - 8897599414
*
భావంలో స్పష్టత, భాషలో బలం, కథ చెప్పే తీరూ తెలిస్తే కథలు రాసినా నవలలు రాసినా అద్భుతంగా అనిపిస్తాయి. చెప్పదలచిన విషయాన్ని చాలా సహజంగా చెప్పడం, రమ్యంగా చెప్పడం ఒక కళ. ముఖ్యంగా పిల్లల విషయంలో కథైనా, నవలైనా పిల్లల స్థాయికి ఎదిగి వారి మాటలను, మనసులను గ్రహించగలిగినప్పుడే, ఆ రచన అందంగా తయారవుతుంది. అటువంటి రచయిత్రులలో అనూరాధ (సుజలగంటి) ఒకరు. ఏ డొంక తిరుగుడూ అనవసరమైన నీతులు గుమ్మరించే సంభాషణలూ లేకుండా, సామాన్యంగా మనం సంభాషించుకునే విధంగా ‘విద్యామందిరం’ నవలను పిల్లల కోసం రచించారు. ఒక బడిలో, చక్కటి వాతావరణం ఎలా ఉండాలో అలా రచన చేశారు. అనూరాధ మంచి ఉత్తమ విలువలు కలిగిన ప్రిన్సిపాల్‌గారు. ఆమె వద్ద సహజంగానే ఉత్తమమైన టీచర్లూ, విద్యార్థుల మనసెరిగి ఎలా మాట్లాడాలో అలాగే చక్కగా బోధనలు చేస్తూ తెలివిగల విద్యార్థుల చేత పనులు ఎలా చేయించుకోవాలో, పిల్లలందరినీ ప్రేమగా ఎలా చేరదీసి అభినందించాలో తెలియజేశారు. పిల్లలని కార్యక్రమాల వైపు ఎలా దృష్టి స్కూలు యాజమాన్యం మళ్లించాలో చక్కగా వివరించారు. అంతేకాదు పిల్లల మనసెరిగి, ఎంత బిజీగా వున్నా తల్లిదండ్రులు పిల్లల కోసం, చదువుతోపాటు, ఆటలూ, పాటలూ, వ్యాయామాలూ అవన్నీ కూడా నేర్పించాలి అన్న విషయాన్నీ చక్కగా చెప్పారు. విద్యామందిరం, ప్రతీ స్టూడెంటు చదవవలసిన చక్కని నవల.

-శారదా అశోకవర్థన్