Others

దివ్య తత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనలోని దివ్య తత్త్వాన్ని తెలుసుకుని మనం జీవిస్తే మనమూ మహాపురుషులం అవుతాం. ఆ మహత్వం మీలోనూ, నాలోనూ, మనందరిలోనూ ఉంది. ఎరుకతో మనం ఆ దివ్యత్వ స్థితితోనే ఉండగలం. అవతారులు అని మనం చెప్పుకుంటున్న రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్, షిర్డీ బాబా వీరంతా కూడా తమను తాము తెలుసుకుని ముక్తపురుషులయ్యారు. మనం దివ్యతత్వ స్వరూపాలే తప్ప కేవలం మాంస నిర్మిత దేహాలం కాదు. వారెలా ముక్తులయారో అదే విధంగా అందరం మన దివ్యత్వాన్ని మనం తెలుసుకుని ముక్తిని పొందగలం.
ధ్యానం ద్వారా తద్వారా పొందే జ్ఞానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, అహింస వల్లా వివేకభరిత జీవితం మనం పొందాలి. మన ఆశయాలు మనకు ప్రియాన్నిచ్చే జీవనంగా సాగుతూ, మనలో సాగే గొప్ప ఆలోచనా సంవిధానాన్నీ, అద్భుత అవగాహనా పటిమను పెంపొందించాలి. క్రమంగా మన జీవనం ఆనందమయంగా సాగుతుంది. ఆనందం అంటే ఆత్మస్థితి.
శరీరం సుఖాన్ని కోరుతుంది. మనస్సు సంతోషాన్ని ఇష్టపడుతుంది. చిత్తం చంచలం. హృదయం స్పందిస్తుంది. బుద్ధి వికాసం తో ఉంటుంది. ఇవన్నీ తాత్కాలిక మైనా, ఆనందం మాత్రం శాశ్వతం - ఎందుకంటే ఆనందం ఆత్మస్థితి.
ఈ విషయాలను ధ్యానించాలి. ఈ సత్య వాక్కులన్నింటినీ మన వ్యక్తిత్వంలోకి ఆహ్వానించాలి - అనుమతించాలి. వీటిని స్వీకరించినపుడు ఆలోచన తర్వాత ఆలోచనగా, అనుభూతి తర్వాత అనుభూతిగా, క్షణక్షణం ఆ అవగాహనకు దగ్గరౌతూ మన మహత్తత్వాన్నీ, మన శక్తినీ, మన ప్రాభవాన్నీ మనం గుర్తిస్తాం.
మన జీవితంలో అతి గొప్ప విజయం మన పట్ల మనం నిజాయతీగా ఉండడమే! అదే మనను మనం జయించుకోవడం! సత్యం ఏమిటో తెలుసుకోవాలన్న ఆకాంక్ష మనిషిలో ఉన్నపుడు, అనంత ప్రకృతి - జీవశక్తిలోనే - ఉనికిలోనే అగోచరమైన భగవంతుడున్నాడని అర్థమవుతుంది.
ఈ అవగాహన ఉన్నపుడు కాలక్రమంలో మనమే అంటే మానవుడే యావత్ సృష్టిలోనూ సర్వోత్కృష్టుడని అవగతమవుతుంది. సూర్యుడు శాశ్వతంగా కొనసాగుతుంటాడు. మరి మనిషి మృత్యువాత పడుతుంటాడు. దానికి ఏకైక కారణం సూర్యుడు ఏనాడూ, ఏ మాత్రమూ మృత్యువును గురించి ఆలోచించకుండా ఉండిపోవడం అని అర్థం అవుతుంది.
ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే మనం అల్పజీవులం అనుకుని, నిస్సహాయంగా ఉండిపోతున్నాం. ప్రజ్ఞానాన్ని ప్రాప్తించుకుంటే మానవుడెంతో మహోన్నతుడవుతాడు. ఎలా ఉండాలని మనిషి సంకల్పించుకుంటే అలానే ఉంటాడు. తానో దౌర్భాగ్యుడినని, శక్తిహీనుడిననీ పదేపదే తనను తాను నిందించుకుంటూ ఉంటే ఆ మానవుడు దౌర్భాగ్యుడే, శక్తిహీనుడే అవుతాడు. ‘వాయువుకు కూడా తానే అధిపతి’ అని అనుకుంటే మానవుడు వాయువుకూ అధిపతి అవుతాడు.
తనను దైవంగా భావించుకుంటున్న మానవుడు స్వయంగా దైవమే అవుతాడు. ఈ ప్రజ్ఞస్థితమైన తర్వాత, ఆ సత్యజ్ఞానం గ్రహించిన తర్వాత ఆ ప్రాజ్ఞుడు - దివ్య ప్రేరణలు ఏ బోధనవల్లో, ఏ బోధకుల వల్లో రావనీ, సర్వసృష్టి యొక్క మూలాల్లోంచే అవి అందుతున్నాయనే పరతత్వ బోధ కలుగుతుంది.
మన నమ్మకాలు, అవగాహనలు, ఆలోచనలు, జీవితాలు - అన్నీ జన్మజన్మల్లోని వైఫల్యాల మీదనే ఆధార పడి ఉన్నాయి. ఆ వైఫల్యాలే ఎన్నో విజయాలకు సోపానాలు. అవే శిఖరాగ్రాన్ని అధిరోహించే మార్గదర్శకాలు. వైఫల్యాల తర్వాత వచ్చే విజయాలే మనం వౌలికంగా దైవమేనన్న సత్యాన్ని గ్రహించేలా చేస్తాయి. వైఫల్యాలను అనుభవాలుగా స్వీకరించడం దివ్యత్వంలో భాగం.
బలీయమైన, మహత్వపూర్ణమైన ఆలోచనలే మన సర్వ వ్యాపకత్వానికి హేతువులు. ఆలోచనలోని అవగాహనలన్నింటినీ, మన మీద కేంద్రీకరించుకోవడం వల్లనే మన ప్రజ్ఞ ఇనుమడిస్తుంది. అజ్ఞాతంగా ఉన్న మన దివ్యత్వంతో మనకు తాదాత్మ్య సిద్ధిస్తుంది. జీవితం పరిపూర్ణమవుతుంది.
ఎప్పటికయినా మనమే విజేతలం - కారణం మనమంతా దేవుళ్లం.
(రామ్తా ది వైట్‌బుక్ మరి రచయిత ప్రేరణల నుండి)

-మారం శివప్రసాద్.. 9618306173