Others

ఆశాపాశపు నిరీక్షణలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్టు ముందా? విత్తు ముందా? అనే అనునిత్య
ప్రశ్నా పరంపరలో ప్రభవించిన కాలకూట విషమిది
మానవీయ విలువలను తన మూలాల శూలాలతో
ఛిద్రం చేస్తున్న అంతర్నేత్రపు దృక్కోణమది...
వౌలిక మృగనీతిని విస్మరించి సాటి మనిషిపై
సాగిస్తున్న దమననీతికి నిదర్శనమ్మది
నిండు మానవ జాతిని అణువణువునా
మాడ్చి మసి చేస్తున్న అగ్నిపర్వతపు లావా అది
అక్రమ సంపాదనా యజ్ఞానికి స్వీయ సుఖ
జీవన కాంక్ష ఆజ్యమై
అందినంత మేర కబళించాలనే అగ్నికీలల
దావానలమిది
మమతను పంచి సమతను పెంచే కన్నతల్లులు
కరువైన లోకంలో కాంక్రీటు స్వార్థపు హృదయ
సామ్రాజ్ఞి అది..
జాలి, దయ, కరుణ, ఆర్ద్రత, స్పందనల
సాగర మధనాన అపర భగీరధుడుద్భవించి
‘అవినీతి’ రావణుని పీచమణచిన రోజు..
లోకమంతా నీతిమంతమైన నిత్య దీపావళి

-కొత్తపల్లి ఉదయబాబు 9533756075