Others

శ్రమజీవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూడడానికి వాళ్లు బడుగులే
పిడికిలి బిగిస్తే పిడుగులే
పని ఒడిలో ఒళ్లు వంచిన శ్రామికుడు
అని భూమిలో విల్లు వంచిన శ్రీరాముడు
కృషిని నమ్ముకున్న ఋషులు వాళ్లు
ఆ కండల కమండలాల్లో ఊరే స్వేదజలం మంత్రజలమే
ఆ స్వేదం కట్టడాల పాలిట వేదం
ఆ శ్రమకు చకితమై ఇటుకలు చిటికెలో
మిన్నందుకుని మేడలవుతాయి
ఆ శ్రమాంబువులు ప్రవాహాలకు లక్ష్మణ రేఖలు గీస్తాయి
ఆ చెమటకు తడిస్తేనే
బంజరు భూములు బంగరు నేలలవుతాయి
ఆ చేతుల్లో పలుగులు ప్రగతి పథానికి వెలుగులు
ఒలికిన ఆ ఘర్మ జలాలు చిలకించును శుభఫలాలు
ఆ కండలు రాల్చిన చెమట పూలు
మన ఆనంద జీవనానికి పూలదారులు
మాటలు మోసే పరాన్న భోజులకన్న
మూటలు మోసే శ్రమజీవులు మిన్న
స్వల్పార్జన కోసం రెక్కలు ముక్కలవుతున్నా
తిండికి బట్టకు తడబడే చాలీచాలని రాబడి
వారి నెత్తురు పెట్టుబడిదారుల విలాసాలకు అత్తరు
కష్టపడడం తప్ప కష్టపెట్టడం తెలియనిది కార్మికలోకం
ఆ కడుపులు కొడితే తప్పదు దేశానికి శోకం
*

-చిరమన వెంకట రమణయ్య 9441380336