Others

కొత్త వ్యాపార వస్తువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోయిలో పిల్లి లేవడానికి
ఆడు ఏడాడనో తిరిగిండు

ఉజ్జోగం ఇప్పించని సధువుని
కసి తీరా తిట్టుకుంటూ అడ్డా మీద
నిలువు స్తంభమై పోయిండు

రెక్కలు ముక్కలు సేసుకొని
వెనకేసిన రాళ్లన్నీ
ఊర్లో కామందు అప్పు కిందకె పాయె

ఆడి సోపతి ఎవడో చెవిలో చెప్పిండు
పెద్ద పట్నంలో కొత్త ఉజ్జోగం అంట
శేరిక జేస్తే నాల్గు పైసల్
కళ్లజూడొచ్చు

గా ఏజెంటు అచ్చి ఉన్న ఫలంగా
తొలకబోయిండు రైల్‌గాడి ల

ఓరిని ఆడ సూత్తును గందా
అంతా భోగమే. రాజ భోగమే
ఏళ్ల తరబడి ఆకలి
ఒక్క లెక్కన తీర్సుకున్నా

కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర
ఇగ సాల్ తీయి అనుకోని
కుషాలంగా నిద్ర పోయిన

వారం రోజులు
దవాఖానల చుట్టూ తిప్పిన్రు
ఏవేవో మందులు, మాకులు
ఇంజెక్షన్లంటూ
పేయికి ఎక్కించి తూట్లు పొడిసిన్రు

రెండు దినాలుంచుకొని
ఉరికి పొమ్మని చేతిలో పైసల్ పెట్టి
రైల్ గాడినెక్కించారు

మూడు నెలలో
ఆరు సార్లు గట్లపోయిన...

మొదట్లో మంచిగానే ఉండే
ఓ దినము చెంబుడు రత్తం కక్కుకొని
కళ్లు తెల్సేన

పేయి అంతా
ఆగం ఆగం అవుతుంది
కింద మీద తన్కలాడుతున్న
పాణం వోష పడ్తలేదు..

ఉరి డాక్టర్ తాన్కిపోయిన
టెస్టులు అవి జేసిన్రు
ఇగ అయన సెప్పిన తరీఖ జూసి
భూమీద ఎక్కవ నూకలు లేవు
అనుకున్నాను...
ఆయాల్టీకి ఇంటికి అచ్చి
దిగులుతోనే పడుకొని
రాత్రికి రాత్రే
యమపురికి బయలెల్లినా...

పొద్దుగాల పేపర్‌ల
నా సావు వార్త అయ్యింది
నా పేయినే ‘మందులకు’ ఎర వేసారట..
శరీరాన్ని కూడా యాపారం చేసిన
కార్పొరేటు నీకో సలాం..!
*

-సాగర్ పుష్యమి.. 9032215609