Others

అగ్నిపర్వతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది అనాదిలో సైతం
మురిపె మెరుగని పిరమిడ్‌ని
లోహపు పాద ఘట్టనలో
ముక్కలగుతూ కూడ
ఒక్కటయ్యే పాదరస పాత్రని
ఉరుము మెరుపుల
కనుకాంతికి భీతిల్లే
పరుగు పందాల జింక పిల్లను
పుడమి తల్లి మాత్రం
పూవుకు రంగులు
పులిమిన మాట సత్యం
ప్రకృతి నిండు హృదయంతో
పరిమళాలు చల్లిందనడం నిస్సందేహం
ఎటొచ్చి.. పుణ్యకార్యాలకే కరువు
గుండెల్లో సూదులు దిగమ్రింగిన

దండల కొలతే అత్యధికం
ఎట్టకేలకెక్కడో
చైతన్యం పుట్టిందంటే
అది అవాస్తవాల
అద్దాల ప్రతిబింబమే
రాజులు రారాజులు
కవులు కథకులకు
నేనో.. చక్కని సరసగీత మాలికను
నటన, నాట్య, పక్వ పరిమాణాలలో
నాదొక ప్రథమ స్థానం
కోరికల కుంభవృష్టికి
ఆకర్షణ అయస్కాంతాన్ని నేనే
సమత, మమత, సవరణలలో
నాకు నేనే సాటి
కాని బలమే విలోమం
అధికారంలో అసమానం
అదే.. అదే
తరతరాలుగా నాలో
ఆరని అగ్నిపర్వతం.
*

-వూట్ల భద్రయ్య 9550256840