Others

ముఖాలు వికసిస్తాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పువ్వులే కాదు
ముఖాలు వికసిస్తాయి

నవ్వులే కాదు
వదనాలు హసిస్తాయి

పెద్ద వయస్సేమి కాదు
ఇప్పుడిప్పుడే జంట పదాలను
వొంటబట్టించుకుంటుంది

ఇప్పుడు అప్పుడే
బడికి పోతుంది
ఒక బ్యాగు
నీళ్ల బాటిల్ పలక
టిఫిన్ బాక్స్ మాత్రం
ముందే కొనిపిచ్చింది

పొద్దున తయారవుతుంటే
ముఖం ఒక తాజా పువ్వుగా

ఒడిలో ఎత్తుకొని బడిలో
తోలేసుడు అమ్మమ్మ వంతు

ఆఫీసు నుంచి వచ్చే
అమ్మ కోసం ఫోన్ చెయ్యమంటుంది
కాస్సేపు ఆగి
‘అమ్మ ఏడిదాక వున్నదట’
కొత్తకొత్త వాక్యాలు నిర్మిస్తుంది

సాయంత్రం తీసుకొచ్చేటప్పుడు
ముఖమంతా చిన్నబోయి
వాడి తలవాల్చిన పువ్వులా

చెయ్యి పట్టుకు తీసుకురాంగా
తొవ్వ పొంటి
మనుమరాలు ఒల్సెన్ని ముచ్చట్లు

పువ్వులే కాదు
ముఖాలు వికసిస్తాయి

నవ్వులే కాదు
వదనాలు హసిస్తాయి

-జూకంటి జగన్నాథం