Others

హైకూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని చదువులు చదివినా
ఏమి లాభం?
మానవత్వం పరిమళించనపుడు
మానవత్వమే మనిషిలోని దైవత్వం

నేటి ‘నీటి’ వృథా
భావితరాలకు
కన్నీటి వ్యథ

‘అమృతం’ సురలకు
పంచాడు విష్ణువు
‘అమ్మ’ను మానవాళికి
ప్రసాదించాడు బ్రహ్మ
గర్భగుడిలో దేవుడు
భక్తులు కోరేది దైవదర్శనం
హుండీ నిండాలని గుడి ధర్మకర్తలు
కోర్కెలు పండాలని భక్తజనం

గుళ్లల్లో దేవుళ్లకు
క్షీరాభిషేకం
ఆకలితో
అలమటించే
పసివాళ్లకు
కన్నీటి అభిషేకం

ర్యాగింగ్
చేసేవాడికి ‘క్రీడ’
భరించేవాడికి ‘హింస’
ఖండించాలి సభ్య సమాజం

అంగారకునిపై లేదు జీవం
జీవం ఉన్నచోట
మనుషులకు లేదు జీవం

ఒకప్పుడు,
పుస్తకం హస్త్భూషణం
చదివితే మస్తిష్కం మెరుగు
ఇప్పుడు,
మొబైల్ హస్తంలో ఇమిడి
చేస్తున్నది మస్తిష్కాన్ని నాశనం

ఈ కలిలో
ఆకలి జబ్బుకు
అన్నమే ఔషధం
ఉన్నవాడికి
అన్నం తిన్నా
అరగని జబ్బు
లేనివాడికి
అన్నం దొరకక
ఆకలి జబ్బు

నీ జీవితానికి నీవే కర్త
నిందించకు విధిని
నిర్వర్తించు నీ విధిని

అక్షరాలు.. మనుషుల బ్రతుకుల్లో
జ్ఞానదీపాలు వెలిగించే
దైవ స్వరూపాలు
శ్రమ జీవి గానం
సరిగమలు
శృతిలయలు తెలియని
నిరంతర
పరిశ్రమ గానం
రెక్కాడితే గాని
డొక్కాడని వైనం
పచ్చడి మెతుకులే
పంచభక్ష్య పరమాన్నాలు
పంపునీళ్లు వారికి
మినరల్ వాటర్
ఆరు బయట గాలులు
‘ఏసీ’ గాలులు
శ్రమజీవులు
దేశ ప్రగతి రథచక్రాలు

-గజవెళ్లి శ్రీనివాసాచారి 9059438068