Others

కారణ జన్ములు - రుద్రాంశ సంభూతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వేంకటాచలంగా పేరుపొందిన తిరుమల కొండ ప్రస్తావన భవిష్యపురాణంలో కనిపిస్తుంది. జనకమహారాజుకు కుల గురువు శతానందులు ఈ వివరణ ఇచ్చినట్లు తెలస్తుంది. నేటి తిరుమల పూర్వకాలంలో అంజనాద్రిగా పేరుబడయడానికి కారణం హనుమంతుడని అంటారు. దేవగురువు బృహస్పతికి పుంజిక స్థల అనే ఒక పరిచారిక ఉండేది. శాపవశాత్తు ఆమె వానర స్ర్తి రూపం ధరించాల్సి వచ్చింది. శివాంశకు ఆమె జన్మనిస్తే ఆమెకు శాపవిమోచనం కలుగుతుంది అని ఆమె తెలుసుకొంది. పుంజక నే అంజనగా వానర స్ర్తిగా పుట్టింది, కేసరి అనే కపిరాజుకు భార్య అయింది. సంతానం కోసం ఎన్నో జపతపాలు ఆ దంపతులు నిర్వహించారు.
ఒకసారి మతంగముని ఆశమ్రానికి వారు వెళ్లారు. ముని దర్శనం అనుగ్రహం వారికి కలిగింధి. వారి సంతాన కోరిక ముని విని అంజనాదేవికి మంత్రోపదేశం చేశారు.
ప్రతిరోజూ ఆకాశగంగాతీర్థంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీనివాసుని ధ్యానించాలని మతంగముని అంజనకు చెప్పారు. ఆమె అదేవిధంగా చేస్తుండేది. ఇలా 12 ఏళ్లు అంజన తపస్సు చేసింది.
ఆ శ్రీనివాసుని దయ, శివుని కరుణ, వాయుదేవుని కృప కలసి అంజనాదేవికి ఆంజనేయుడు కుమారుడుగా లభించాడు.
అది ఎలా అంటే దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసి ఫలంగా పాయసం సంపాదించుకున్నాడు. ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు. అట్లా ఇచ్చేటపుడే శివాజ్ఞ మేరకు ఒక పక్షి పాయసాన్ని రవ్వంత ముక్కున కరుచుకుని ఎగిరిపోయిందట. కాని ఆ పక్షి ముక్కునుండి అది జారి పోయింది. ఆ భూమిమీదకు జారిపోతున్న పాయస పదార్థాన్ని వాయుదేవుడు చూసి తపస్సు చేసుకొంటున్న అంజనాదేవి చేతుల్లో పడేట్లు చేశాడు. ఆమె ఆ పాయసాన్ని ప్రసాదంగా భావించి సేవించింది. అపుడే ఆంజనేయుడు ఆమెకు పుట్టాడు. దానివలన ఆమెకు శాపవిమోచనం కలిగింది.
ఈ హనుమంతుడే రామునికి బంటు అయ్యాడు. సీతానే్వషణ లో ఉన్న రామలక్ష్మణులకు తోడుగా నిలిచాడు. వంద యోజనాల సముద్రాన్ని లంఘనం చేసి లంకలో ప్రవేశించాడు. అక్కడ సీతమ్మవారిని చూశాడు. ఆ విషయం రామునికి తెలిపాడు. ఇలా సీతానే్వషణ కోసం సముద్రాన్ని లంఘించేక్రమంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. సూర్యుని గురువుగా చేసుకొని శాస్త్ధ్య్రాయనం చేశాడు. మొదటి మాటతోనే రాముని అభిమానాన్ని చూరగొన్నాడు. సీతమ్మకు ధైర్యాన్ని కలిగించాడు. రామునికి స్థైర్యాన్నిచ్చాడు. అటువంటి హనుమంతుని జీవితం నుంచి మానవులు ఎన్నో గ్రహించాలి. సేవకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. అమిత సాహసకార్యాలకు నిలువెత్తు సాక్షం అయ్యాడు.హనుమంతుని గురించి తులసీదాసు చాలీసా విరచించాడు. శారీరిక, మానసిక ఆధ్యాత్మిక వికాసాలు కావాలనుకున్న వారు తప్పనిసరిగా హనుమంతుని జీవిత చరిత్రను చదవాలి. హనుమంతుని ఉపాసన చేసినవారికి హనుమ రక్షణ సదా ఉంటుంది.

- ఎ.ఎస్. ఎన్. బి. శర్మ