Others

పాపాలను శమింపచేసే శమీపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ’’ ...్భరత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ఫ్రాధాన్యత కల్పించ బడింది. శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా, దుర్గామాతను తొమ్మిది రోజులుగా కొలిచినట్లయితే సర్వ శక్తులు సమకూరి, విజయ దశమినాడు విజయం చేకూరగలదని భక్తుల, ఆధ్యాత్మిక కార్యానురక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులకై దసరా నవరాత్రి ఉత్సవాలలో ముగింపుగా విజయ దశమి పర్వ దినాన శమీ (జమ్మి) వృక్షాన్ని పూజించి, సర్వాభీష్ఠ సిద్ధికై ప్రార్థించడం ప్రాచీన కాలంనుండి అనుసరిస్తున్న సత్సాంప్రదాయం. పూర్వకాలంలో రాజులు తమ విజయ యాత్ర సన్నాహక కార్యక్రమాలుగా ‘‘అగ్నిపూజ, గుర్రాలు, ఏనుగులు’’ మొదలైన వాటికి కొన్ని అర్చనలు చేయడాన్ని ఆచరించారు. దానిలో భాగంగానే శమీవృక్ష పూజ చేసి, యుద్ధానికి వెళ్ళేవారు. యజ్ఞ యాగాదులలో అగ్నిని ఆవిర్భవింప చేయడానికి అరణినిఉపయోగిస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువు ‘‘అరణి’’. అగ్నిని పుట్టించడంలో అడుగు కర్ర జమ్మికర్ర. పై కర్ర రావికర్ర వాడతారు. జమ్మిని స్ర్తిలింగంగా, రావిని పుంలింగంగా (శమింతా, అశ్వత్థ:) ఆర్యులు పేర్కొన్నారు. విజయ దశమి నాడు శమీవృక్షాన్ని పూజించే క్రమంలో రామార్జున గాధలను స్మరించే సంప్రదాయం ఉంది. రాముడు, రావణునిపై విజయం సాధించిన దినంగా, పాండవులు వనవాసం వెళుతూ, శమీవృక్షం పైనుండి తమ ఆయుధాలను తిరిగి పొంది కౌరవులను జయించిన దినంగా విజయ దశమికి ప్రత్యేకత ఉంది.శమీవృక్షానికి శాస్ర్తియ నామం ప్రొసోపిస్ సైసిజెరా. జమ్మి ఎన్నో వ్యాధులకు ఔషధంగా కూడా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెపుతారు.

-- రామకిష్టయ్య