Others

శ్రీరంగ దర్శనం ముక్తికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవైష్ణవ క్షేత్రములు 108. వీటికే నూట ఎనిమిది తిరుపతిలని పేరు. అందులో అతి శ్రేష్ఠమైనది శ్రీరంగ క్షేత్రం. 108 తిరుపతులు ఒక మహా వృక్షం. ఆ మహా వృక్షానికి వేరులాంటిదే శ్రీరంగ క్షేత్రం! మహావృక్ష వేరైన శ్రీరంగం దర్శించుకుంటే 108 దివ్య క్షేత్రాలను దర్శించిన ఫలమట.
త్రేతాయుగంలో ఇక్ష్వాకు మహారాజు శ్రీరామునిచే రక్షణ పొందిన విభీషణుడు శ్రీరంగనాధుని భక్తుడగుటచే శ్రీరంగ విమానం, శ్రీరామునిచే ప్రసాదంగా పొంది లంకకు బయలుదేరి, త్రోవలో కావేరీ నది వద్ద మధ్యాహ్న పూజకై అచట ఆగారు. శ్రీరంగనాధునికి పూజాదికాలు నిర్వహించారు. ఆ ప్రాంతపు రాజు ధర్మవర్మ శ్రీరంగనాధ భక్తుడు. అక్కడే ధర్మవర్మ కోరికపై బ్రహ్మోత్సవాలు జరిపారు. బ్రహ్మోత్సవాల అనంతరం విభీషణుడు లంకకు పోవాలని, శ్రీరంగ విమానం కదపగా అతుక్కుని రాలేదట. శ్రీరంగనాధుడే ప్రత్యక్షమై వివరించిరి.
శ్రీరంగంలో శ్రీరంగనాధుడు వెలయుటకు వినాయకుడుకూడా కారణమంటారు. కావేరీ నది వద్ద అవసరార్థం విభీషణుడు ఆగగా, బాలుని రూపంలోనున్న వినాయకుని పిలిచెను. ‘‘శ్రీరంగనాథుని విగ్రహమిచ్చి క్రిందపెట్టవద్దని చెప్పెను. విభీషణుడు అటు వెళ్లగానే విగ్రహాన్ని భూమిపై నుంచెను. ఆ బాలుని వెంటాడగా శ్రీరంగనాథుడు ఆ ప్రదేశంలో అవతరించాలని చెప్పారుట. ఆ విధంగా కూడా వెలిసినట్లు.
కావేరీ, కొళ్లిడం అనునవి ఉపనదులు. కర్నాటక నుండి ప్రవహిస్తూ శ్రీరంగం ఎగువన రెండుగా చీలి రంగనాధునికి పూలదండలు అయ్యాయి. ప్రకృతికి అందంగా కూడా అలరారుతున్నాయి.
ఇక్ష్వాకు రాజు శ్రీరామునిచే భూలోకానికి వచ్చి చోళరాజైన ధర్మవర్మ వలన కావేరీ నది ఒడ్డున అవతరించి, భక్తుల అందరిని కాపాడుతున్నారు. ధర్మవర్మచే నిర్మాణం అనేక మండపాలు, గోడలు, గోపురాలు కట్టబడ్డాయి. 5వేల సంవత్సరాల పూర్వం కట్టబడింది ఈ దేవాలయం. చోళ, పాండ్య, విజయనగర నాయక రాజుల చేత అభివృద్ధి చెందింది.
‘‘శ్రీరంగం మూల విరాట్ అమ్మ రంగనాయకి సమేతంగా దివ్య దర్శనం. ఐదు తలల ఆదిశేషువు తల్పంపై శ్రీరంగనాధుని శయనం. కుడి చేతితో తన కిరీటం చూపిస్తూ, అన్ని లోకాలకు, అందరి దేవతలకు తనే నాధుడు అని తెలియజేయటం. ఎడమ చేతితో ఓ జీవులారా! ననే్న ఆశ్రయించి జన్మసార్థకత చేసుకోమని ఉద్బోధిస్తున్నట్లు, శేషశయనుని దిగువన శ్రీరంగని ఉత్సవమూర్తి చతుర్భుజ రూపుడైన శ్రీ మహావిష్ణువు. శ్రీరంగ మండపం 24 స్తంభాలతో ఉంటుంది. విమానంపై దేవదేవుని రూపం, బంగారు రేకుతో విమానం అమర్చబడింది.
శ్రీరంగం స్థల, మూర్తి, క్షేత్ర విశేషాలు కలది. అన్నిటికి పెద్దదిగా ఎంచి చెప్పదగిన దివ్యక్షేత్రం. శ్రీరంగంలో అందమైన ఏడు ప్రాకారాలు ఉంటాయి. మిగతా దివ్య క్షేత్రాలలో ఇలా ఉండవు. చిత్ర విచిత్ర శిల్పాలతో 22 గోపురాలుంటాయి. ఇవి కూడా క్షేత్రాలలోను కానరావు. భగవంతుడే తృప్తితో తనకు తానుగా వెలయుట, ప్రతిష్ఠించుకున్న ఎనిమిది క్షేత్రాలలో శ్రీరంగం ఒకటి. శ్రీరంగ క్షేత్రం నేటి తమిళనాడు రాష్ట్రంలో కలదు. శ్రీరంగనాధ పెరుమాళ్ళుకు ప్రతిదినం ఉత్సవమే. నిత్య, నైమిత్తిక, వార, పక్ష, మాస, ఋతు, సంవత్సర ఉత్సవాలు అనేకములు కలవు. శ్రీరంగనాధునకు, అమ్మవారికి నాలుగు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి.
మహమ్మదీయుల రాజులచే దండయాత్రలు జరిగినపుడు అర్చనలు శ్రీరంగనాథుని శ్రీరంగం నుండి తిరుపతికి చేర్చారని ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడ్డాక మరలా తీసుకువచ్చారు. తిరుపతిలో అతిథిగా ఉండుటచే అక్కడ ఈయనకు పాంచరాత్ర పూజలు నిర్వహించేవారు. ఇప్పటికీ తిరుమలలో శ్రీరంగ మండపం శ్రీరంగనాధుని పేరుతో ఉంది.

-ఎ.ఎస్.నాగభూషణశర్మ