Others

ధర్మమే దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనయుడు తనవాడైనా ధర్మం తప్ప మరొకటి చెప్పరాదని తమ్మడు తనవాడైనా ధర్మమే చెప్పాలని అర్యోక్తి. జీవితంలో ధర్మం జీవనదిలా ప్రవహిస్తున్నంత కాలం అంతా మంచి జరుగుతుంది అన్న విశ్వాసం మహర్షులు, శాస్త్రాలు ప్రబోధిస్తూనే ఉన్నాయి. కానీ క్షణికావేశాలకు బానిసై క్షణికానందాలకు దాసుడై విచ్చలవిడిగా విహరిచే స్వభావమున్న వాడికి ధర్మం విలువ కాని , ధర్మం చూపే వెలుగు కాని అర్థం కావు.
మల్లె ఎవరికోసమో వికసించదు. వికసించడం దాని సహజ లక్షణం. చెట్టు ఎవరికోసమో ఫలాలినివ్వదు. పూత కాతై కాత ఫలాలుగా మారడం దాని సహజ ప్రక్రియ. ప్రకృతిలోనే యుగయుగాలుగా ఇన్ని విశేషాలున్నప్పుడు మనిషి ధర్మం పట్ల పూర్తి విశ్వాసం కలిగి ధర్మమే దైవం, దైవమే ధర్మమన్న రీతిలో వ్యవహరించగలగడం తనకు తన కుటుంబానికి అంచనాలకు అందనంత శక్తిని సమకూర్చుతుంది. నిజమే ధర్మంమే దైవం. ప్రపంచంలోని ప్రతిచోట ధర్మగుణం రూపం లో దైవం సాక్షాత్కరిస్తుంది. ఒకరిని నమ్మించేందుకో, ఇంకొకరిని మెప్పించేందుకో ధర్మం కోసం తపిస్తున్నట్లు కనిపించదు.
ఎంతగా పదిమందితో కలసి జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నా ధర్మాన్ని కాదని అంతటితో ఆగక కలియుగంలోధర్మమెక్కడుందన్న ప్రశ్న సంధించడం కానీ, ఎవరికీ పట్టని ధర్మం తనకెందుకని అనుకోవడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.
ధర్మాధర్మాల మధ్య తేడా తెలిసిన వారు సత్కర్మలు మాత్రమే ఆచరిస్తుంటారు. అధర్మం దురాలోచనలను పెంచి పోషిస్తుంది. ఫలితంగా దుర్మార్గం పెచ్చరిల్లి ఇంటా బయటా ఎటుచూసినా అశాంతి వికటాట్టహాసం చేస్తుంది. ఫలితంగా వ్యక్తికి సమాజానికి జరిగే నష్టం పూడ్చలేనిది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా నేర్పుగా చుట్టుకోగలిగినా ప్రయోజనం అంతగా ఉండదు. ఒకింత ముందు చూపుతో మరీ ముఖ్యంగా ఆత్మ విమర్శతో అనుక్షణం జాగ్రత్త పడేవారు తమను తాముధర్మమార్గంలో ఉండేవిధంగా చూసుకొంటారు. ధర్మమార్గమే జీవన విధానమైనపుడు ఎటువంటి బాధలు, భయాలు మనిషిని ఏమీ చెయ్యలేవు. అడుగడుగునా ఎదురయ్యే అవరోధాలు, ప్రలోభాలు తిప్పి కొట్టగలిగే ధైర్యం ధర్మం వల్లనే సాధ్యపడుతుంది. నిత్యజీవితంలో ధర్మం మాటై వినిపిస్తుంది. బ్రతుకుబాటలో కనిపిస్తుంది.
ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జీవన శైలి ఉంటుంది. ఎవరి జీవనశైలి ఎలా ఉన్నప్పటికీ అది ధర్మబద్ధమై ఉన్నప్పుడు ఎందరికో అది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఎవరి జీవితమైనా వారి ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. తెలివి తేటలకన్నా, సిరిసంపదలకన్నా, ధర్మాచరణకు ప్రాధాన్యత ఇచ్చేవారిని కళ్లముందు కదలాడే దైవంగా చూపుతుంది. ధర్మం నమ్మినవారికి అంతులేని ఆత్మవివ్వాసమవుతుంది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనే చెక్కు చెదరని ధైర్యమవుతుంది. కష్టాలకు లొంగిపోని, ప్రలోభాలను దరిచేరనివ్వని ప్రబోధమై వినిపిస్తుంది.
ప్రతిక్షణం చేసే పనిలో నడుస్తున్న దైవమై ధర్మం సాక్షాత్కరిస్తుంది. ప్రతినిత్యం ఆపదలు, ఆవాంతరాలు అనివార్యమైనా ధర్మం పట్ల విశ్వాసం కలిగినవారు సరైన దారిలోనే పయనిస్తారు. ఎక్కడైనా ఎవరైనా కించపరిచినా ఎంతమాత్రం బాధపడరు. సరికదతా తాము నమ్మినధర్మమే తమకు శ్రీరామ రక్షగా ఉంటుందన్న బలమైన నమ్మకంతో భవితవైపు అడుగులు వేస్తుంటారు. జన్మరాహిత్యం , పూర్వ జన్మల గురించిన ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ వర్తమానంలో తాను చూస్తున్నదేమిటి? చేస్తున్నదేమిటి అన్న విషయాల పట్ల స్పష్టత ఎంతైనా అవసరం.
ధర్మం ప్రకారం నడుస్తుంటే అంతటా ఆనందమే విల్లివిరుస్తుంది. ఎటు చూసినా వెలుగే కనుచూపు మేరలో సంతోషంమే ఎదురుగా వస్తుంటుంది. తెలియని దివ్యానుభూతి మనసు సొంతమవుతుంది. పైపై మెరుగులకు పరవశించే వారకీ విషయాలు అనుభవంలోనికి రావు. నలుగురు నడిచేదే దారిగా, పదిమంది మెచ్చేదే లోకరీతిగా భావించే వారెవరైనా ధర్మానికి దూరంగా ఉన్నట్టే. జీవితంలో ధర్మాచరణతో కాక అందుకు విరుద్ధమైన మార్గంలో సంపాదించిన సంపదైనా అధికారమైనా, మరొకటైనా బాహ్యాడంబరాలు తాత్కాలికంగా పనికొచ్చేవే కానీ శాశ్వతానందాన్ని ఇవ్వలేవు. ధర్మమే అన్నివేళలా సంతోషాన్ని సంపదను ఇస్తుంది. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి.

-డా.కొల్లు రంగారావు 9866266740