Others

ధరణీనమోస్తుతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుడమి తల్లికి ఎంత ఓపిక అంటే, ఇట్టి భూమిపై పుట్టిన ప్రతీ జీవి జీవించి ఉన్నంతకాలం ఆ జీవి బరువు మోస్తుంది. అదేకాక ప్రాణులకవసరమైనవి, అనవసరమైనవి కూడా ఆమె చెత్త, చెదారం రూపంలో మోస్తూ భరిస్తూనే ఉంటుంది. అందుకే నిద్ర లేవగానే భూదేవికి నమస్కరిస్తాము. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఒక్కొక్క దిక్కుకు నమస్కరించడం వల్ల ఒక్కో ఫలితం వుంటుంది. ఫలితాల మాట ప్రక్కన పెడితే చెట్టు, పుట్ట, చీమ, నరులు సకల జీవరాశులను మోసేది భూమాతయే.
అలాంటి భూమినివాక్కు అనే సంపద ఉన్నమనిషి అద్భుతవిజ్ఞానాన్ని కనుగొన్నాననుకుంటూ టెక్నాలజీ పేరుతో, డెవలప్‌మెంట్ పేరుతో, పరిశ్రమల పేరుతో, చెత్తా చెదారంతో భూమిని తద్వారా వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నారు. జీవరాశి ఎక్కడ అంతమయిపోతుందోననే భయంతో ప్రస్తుత కాలంలో మనిషి పర్యావరణంతో కలిసిమెలిసి జీవించడం లాంటి ఆలోచనలు చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు.
ఒకప్పుడు ఎలాంటి వ్యాధి కూడా దరిచేరని మనిషి, ఈనాడు రోగం అంటుకున్నాక నివారణకై చికిత్సకై వెదుక్కోవలసిన పరిస్థితి. ప్రకృతిని పూజించినంతకాలం, ఆరాధించినంతకాలం అంతా సాఫీగా జీవనం సాగిపోయింది. ఎప్పుడైతే మనిషి సాంకేతిక అభివృద్ధి చెందదలచాడో పర్యావరణం కలుషితమైపోయింది. ప్రకృతి నుండి వచ్చిన ప్రతిదీ ప్రకృతిలోకి వెళ్లాల్సిందే ఒక్క ప్లాస్టిక్ తప్ప. ఎందుకంటే ప్లాస్టిక్ అనే వస్తువు ప్రకృతికి వికృతి.
ఎన్ని బహుళ అంతస్థుల భవనాలను నిర్మించాలన్నా, పరిశ్రమలు నెలకొల్పాలన్నా అన్నీ పవిత్రమైన భూదేవిమీదనే జరగాలి. ఇల్లు కట్టుకుంటే స్తంభాలను నాటడం కోసం గుంతలకోసం పుడమితల్లి శరీరంలో గునపాలు దించాల్సిందే. అలాంటి ఓపిక ఉంది కాబట్టే ఈ భూమండలంమీద సకలకోటి జీవరాశి మనగల్గుతంది. పుడిమిని త్రవ్వితే ఖనిజాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, మణిమాణిక్యాలు- ఇవన్నీ తన గర్భంలో దాచుకొంది భూదేవి. ఇక చుట్టు చుట్టి భూమి చుట్టూ ప్రవహించే నదులు, సముద్రాలు కూడా భూమి మీదనే ప్రవహిస్తున్నాయి. ఇదేగాక భూమిపై ఔషధ మొక్కలు సకల జీవకోటికి పునర్జన్మనిస్తున్నాయి. భూగర్భంలోపలి భాగంలో, భూమిపైన ఎన్నో రకాల వనరులను తనలో ఇముడ్చుకుంది.
నిజాయితీ, పవిత్రత, తపస్సు, సచ్ఛీల జీవితం, ధర్మగుణం, దానగుణం ద్వారా సంక్రమించేటటువంటి శక్తి, యజ్ఞంలాంటిదే భూమిని కాపాడుతున్నాయ.
నేడు ఇలాంటి నిస్వార్థం, నిజాయతీ, పవిత్రతలను మనిషి దూరం చేసుకొంటున్నాడు. సత్యధారణను వదిలి దూరం జరుగుతున్నాడు. ఒక్క సత్యం లేకపోతే ఎన్నో దుర్గుణాలు మనిషికి దగ్గరవుతాయ. దానివల్లనే నేడు భూమితో సహా ప్రకృతి అంతా కాలుష్యభరితం అయపోతోంది. కనుక మనిషి తనలో నీతినిజాయతీని పెంచుకోవాలి. స్వార్థాన్ని విడనాడాలి. నేను నేను అని కాక మనం అన్న దాన్ని అలవాటు చేసుకోవాలి. మనిషి తానొక్కడే బాగుండాలి అని కాక నలుగురూ బాగుండాలి అని ఆలోచించగలిగిన నాడు భూమి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. కనుక నేడు మనిషి తిరిగి చూసుకొని తాను ఏమి చేస్తున్నాడో పునరాలోచన చేసుకొని భూదేవికి నమస్కరించాల్సిందే. అట్లాకాకపోతే తన వినాశనానికి తానే రూపకల్పన చేసుకొన్నవాడు అవుతాడు.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431