Others

మంచి సంకల్పం.. శుభ ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి సంకల్పం చేస్తే మంచి జరుగు తుంది. చెడు సంకల్పాలతో ఉంటే చెడు ఎదురవుతుంది అనేది పామరులైనా పండితు లైనా చెబుతారు. ఇది అందరి అనుభవంలోంచి వచ్చిందే. అందుకే మన పెద్దవాళ్లు ఎపుడు శుభం పలుకమన్నారు. మన మనసులో మంచి సంకల్పం అనే బీజం పడితే అది మొలకై, మొక్కై ఎదగడానికి గట్టి కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిసి సమిష్టిగా పనిచేస్తాయి.
‘‘మనుషులు కేవలం చేసే పనులే చూస్తారు - భగవంతుడు మన మనసులోని సంకల్పాన్ని చూస్తాడు’’. ఆ మాటల వెనుక ఎంతో అర్థం దాగివుంది. ఫలితం కోసం అసలు చూడకూడదనే వారు ఉంటారు. భగవద్గీతలో భగవంతుడు నీవు చేయాల్సిన పనులు చేయు. ఫలితం నీకేమీ కావాలో దాన్ని నేను ఇస్తాను అన్నాడు కదా. నిజానికి మనకేమి కావాలో ఒక్కోసారి మనకు తెలియదు అనిపిస్తుంది. మనం అనుకొన్నది కాక మరోటి జరిగి అది మంచి ఫలితం ఇచ్చినపుడు ఇలా ఆలోచిస్తాము. భగవంతుడు మేలు చేసాడు. నేను అనుకొన్నట్టు చేసినట్లయతే ఫలితం ఇలా వచ్చేది కాదేమో అనుకొంటారు. ఇది కూడా అనుభవంలోని మాటే. ఒక్కోసారి చేసిన పనులన్నీ అనుకొన్న ఫలితాలను ఇవ్వాలి అనుకోకూడదు. భగవంతుడు ఏది నిర్ణయంచి ఉంటాడో అదే ఫలితం మనకు ప్రాప్తమవుతుంది. అన్నింటికీ కారణుడు భగవంతుడే అని నమ్ముకుంటే ఓటమి లోంచి గూడా పాఠాలు నేర్చుకోవచ్చు. ఇలాంటివీ మనం లోకంలో చూస్తుంటాం. దివ్యాంగులు కానీ విధి చేతిలో ఓడిన వారు కానీ ఒక్కోసారి అద్భుత ఫలితాలను పొందుతుంటారు. వారు నలుగురిచేత మెచ్చుకోబడుతుంటారు. అపుడు అనుకొంటే భగవంతుడు ఒకటి తీసివేస్తే నాలుగు ప్రత్యేకతలు ఇస్తాడు అని.
అట్లానే ఫలితం ఇలా వచ్చిందనో రాక అనుకొన్నది జరుగలేదనో అనుకోకుండా చేయాల్సిన కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి. కర్మచేయనిదే ఏ మనిషి కూడా క్షణం కూడా ఉండలేడు కదా. ఆ చేసే కర్మ మంచి కర్మలు చేస్తే పుణ్యఫలితం వచ్చి తీరుతుంది. ప్రతీక్షణం చిరునవ్వుతో జీవించగలిగే ఆత్మస్ధైర్యం అలవడుతుంది. సంతృప్తితో నిండిన జీవిత గమ్యం సొంతమవుతుంది.ఇక్కడొక చిక్కు ఉంది. భగవంతుడు ఎట్లా పరివ్యాప్తమై ఉన్నాడో భగవంతుని మాయ కూడా అంతే వ్యాప్తి చెంది ఉంది. నిముషంలో మాయలో పడిపోవచ్చు. ఉదా.విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేశాడు. వశిష్టుని దగ్గర ఉన్న మంత్రశక్తి చూసి నాకు ఆ శక్తి కావాలి అనుకొని గట్టి సంకల్పం చేసుకొని తపస్సుకు ఉపక్రమించాడు. సంకల్పం మంచిదే. కొన్నాళ్లు చేసాడు. కానీ ఇంద్రుడు చిన్న ఆటంకం కలిగించబోతే అందులో ఇరుక్కుపోయాడు. పదివేల యేండ్ల తరువాత కళ్లు తెరుచుకుని అయ్యో ఇదంతా ఇంద్రుడు ఆడిన నాటకమా.. నేను కాలాన్ని వ్యర్థపరుచు కున్నానే అని బాధపడ్డాడు. మరలా తపస్సుకు ఉపక్రమించాడు. ఆయన గొప్పవాడు కనుక తిరిగి తపస్సమాధిలోకి వెళ్లి అనుకొన్నది సాధించాడు. కానీ సామాన్య మానవులు అందరూ ఒకటే సంకల్ప బలం ఉండదు. మానవులు అల్పసంతోషులు. అందుకే ఏదైనా సంకల్పంతో, గట్టి ప్రయత్నంతో చదువుకుని అనుకొన్న ఉన్నతమైన పదవులు దక్కించు కుంటారు. కాని వారి వెనుక మాయ ఉంటుంది. ఇదంతా నీవు చేసిన ఘనకార్యం సుమా అంటుంది. అంతే దాన్నిఅంటే ఆ మాటను నమ్మితే ఇంకేముంది. మాయలో కూరుకుపోయనట్టే కదా. అక్కడ్నుం చి అహంకారం పడుతుంది. ఎవరినీ లెక్క చేయక చిన్నా పెద్దా తేడాల్లేకుండా మాట్లాడి అజ్ఞానంలోపడిపోతారు. చివరకు అహంకార అజ్ఞానంలో ఇరుక్కుని జీవితాన్ని వ్యర్థం చేసుకొంటారు. అంతలో జీవితం అయ పోతుంది. అట్లాకాక వీరు కళ్లు తెరుచుకునే సరికి జీవిత చరమాంకం వస్తుంది. అపుడు చేయడానికి ఏముంటుంది.వార్థక్యం అపుడు చేయాలని ఉన్నా అవయవాలు సహకరించవు. అపుడూ ధనమదం ఉంటే మనం చేసేది ఏమీ లేదు. అందుకే మంచి సంకల్పంతోబాటుగా మంచి ఆలోచన నిరంతరం భగవంతుని గుణగానాలను తోడుగా పెట్టుకోవాలి. మహ నీయుల జీవిత చరిత్రలను చదువుకోవాలి. అపుడు జీవితంలో అలవోకగా జరిగే ఒడి దొడుకుల గురించి అంతగా కంగారు పడన వసరం లేదు. అన్నింటీ పరమాత్మ ఉన్నాడన్న ధైర్యం తో మంచి పనులను ఏరుకుని మరీ చేయవచ్చు. మంచి సంకల్పంతో వేసే అడుగు ఎంత చిన్నదైనా అది భగవంతుడి దగ్గరకు చేర్చే సోపానమే అవుతుంది. మంచి సంకల్పం మనసులో వుంటే కర్మలు కొంత నియమాలు తప్పినా అవితిరిగి మంచిబాటలోకి త్వరగా తెచ్చుకోవచ్చు. మనసులో మంచి శుబ దృఢంగా వుంటే మన మాటలే మంత్రాలవుతాయి. కార్యాలన్నీ శుభఫలితాలు అందిస్తాయి. మనసే మనిషిని ముందుకు నడిపిస్తుంది. సముద్రాల్ని అవలీలగా దాటి సీతమ్మ ను చూశాను అని రామునికి ధైర్యం ఇచ్చినా, వానర సైన్యం చేత సముద్రం మీద వారథి కట్టించాడన్న బిరుదు పొందినా అన్నింటికీ ఆయనకున్న మంచి సంకల్పబలమే కారణం కనుక శుభాన్ని కోరుదాం. శుభాన్ని ఆశిద్దాం.

- సీతమ్మ