Others

కొల్లేటి వాసుల ఇలవేల్పు పెద్దింటమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్దదైన, సహజసిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. చారిత్రాత్మకమైన ఈ సరస్సుకి కృష్ణా జిల్లాలోని కైకలూరు, మండపల్లి మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని పెదపాడు, ఏలూరు, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు, ఆకివీడు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. కొల్లేరు సరస్సులో 145 గ్రామాలు ఉన్నాయి.
దక్షిణ కాశ్మీరంగా పేరొందిన ‘కొల్లేరు’ సరస్సు మధ్యలో వున్న కోడిదిబ్బ ‘కొల్లేటి కోట’ గ్రామం. ఈ కొల్లేటి కోటలో కొలువైన అమ్మవారి పేరు శ్రీ పెద్దింటి అమ్మవారు. స్థానిక మత్స్యకారులకు కులదైవం శ్రీ పెద్దింటి అమ్మవారు. వీరంతా ఒరిస్సా ప్రాంతంనుండి వలస వచ్చి ఈ కొల్లేరు సరస్సు చుట్టూ స్థిరనివాసం ఏర్పరచుకొన్నారని తెలుస్తున్నది.
కొల్లేటి కోటలో కొలువైన శ్రీ పెద్దింటి అమ్మవారి దేవాలయంలో ‘జలదుర్గ’ అమ్మవారి విగ్రహం కూడా ఉన్నది. 9 అడుగుల ఎత్తు కలిగి, విశాల నేత్రాలతో, పద్మాసన భంగిమలో వున్న శ్రీ పెద్దింటి అమ్మవారు పార్వతీదేవి ప్రతిరూపమే. ఎన్నో మహిమలు గల అమ్మగా, పెద్దమ్మగా ఇక్కడ వడ్డెర కులస్థులేగాక అస్సాం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల ప్రజలువచ్చి భక్తితో అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున ప్రతియేట శ్రీ జలదుర్గా అమ్మవారికి రెండు మైళ్ళ దూరంలో గోకర్ణపురంలో వెలసిన శ్రీ గోకర్ణేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం కడు వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి కొల్లేటి కోట పెద్ద జనారణ్యంగా మారిపోతుంది.
11వ శతాబ్దకాలంనాటి శ్రీ పెద్దింటి అమ్మవారి దేవాలయ దర్శనం యాత్రికులకు నిజంగా మరపురాని ఒక మధురానుభూతి. వేంగి- చాళుక్య రాజుల పాలన నాటికే కొల్లేరు ప్రాంతం ఒక మండలంగా వుంది. కొలను విషయ సాగరు విషయంగా పేరు వున్నట్లు చరిత్రాధారాలు ఉన్నాయి. అంతేకాదు, నేటి కొల్లేటి కోట లంక గ్రామాన్ని ‘కొలనుపురం కొలనువీడు’గా నాడు వ్యవహరించారని శాసనాలవలన తెలుస్తుంది. క్రీ.శ. 10-11 శతాబ్దాలలో వేంగి-చాళుక్య రాజుల వైవాహిక బాంధవ్యాలు ఉండేవని, కమలాకరపుర వల్లభుల శాసనాలు క్రీ.శ. 12-13 శతాబ్దముల వల్ల తెలుస్తున్నది. వీరి పురాలు కమలాకరపురం (నేటి ఏలూరు), పద్మినిపురం (నేటి గణపవరం), కొలనువీడు (నేటి కొల్లేటి కోట)గా గుర్తించారు. క్రీ.శ. నుండి 1076లో వీర విజయాదిత్యుని మరణంతో వేంగిలో చాళుక్యరాజుల పాలన అంతరించింది. వేంగి రాజు రాజ రాజచోళుడు రాజ రాజ నరేంద్రుని కొడుకు, తల్లి తరఫున వారసత్వంగా కాంచీపుర చోడసింహాసనం గెలుచుకొని కులోత్తుంగ చోళుడుగా రాజ్యపాలన చేశాడు. కులోత్తుంగా చోళుని పుత్రుడు వేంగిని పాలిస్తూ యుద్ధంలో మరణించటంతో సామంతుల స్వతంత్ర ప్రకటన వెలువడింది. వేంగి రాజ్యం పరులపాలు కాకుండా కులోత్తుంగ చోళుడు వేలనాటి చోడవీరుని దత్తపుత్రునిగా స్వీకరించి సర్వాధికారాలు ఇచ్చాడు. వేలనాటి చోళులకు సర్వాధికారాలు ఇవ్వడంతో మండలేశ్వరుల తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు చేసినవారిలో కొననవీడు (నేటి కొటలంక) మండలేశ్వరుడైన తెలుగు భీముడు కూడా ఉన్నారు. ఈయన పేరుతో వెలసిన గ్రామమే నేటి భుజబల (్భమ)పట్నం గుర్తించారు. బహు సాహసిగా వాసికెక్కిన ఈ తెలుగు భీముడు మిగిలిన తిరుగుబాటుదారులతో కలిసి పితృపురం (నేటి పిఠాపురం) చాళుక్య రాజుని విజయాదిత్య చక్రవర్తిగా వేంగీశ్వరునిగా చేశాడు. పార్వతీదేవిని ‘పెద్దమ్మ’గా కొలచిన చక్రవర్తి ఈయనే.
పిఠాపురం శాసనాన్ని బట్టి అగస్త్యుడు సముద్రజలాన్ని ఇంకించినట్లు, కొల్లేరు నీరు ఇంకించి, తోడించి, వంతెనే వేయించి, కొల్లేరుమధ్యలో ఎతె్తైన ఒక అభేద్యమైన దుర్గాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. ఈ దుర్గం శత్రువులకు అభేద్యమైనది. ఈ కోట చుట్టూ 150 రాజహస్తాల వెడల్పూ, 7 నిలువుల లోతు, 3కోశాల చుట్టుకొలత గల ఒక అద్భుత అగడ్త ఉండేదని చరిత్రకారులు వ్రాశారు. ఈ కొల్లేరు సరస్సులోని దిబ్బలే కోట దిబ్బలే ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం. దీనినే ప్రస్తుతం ‘కొల్లేటి కోట లంక’గా వ్యవహరిస్తున్నారు. కొల్లేరు పరిసర ప్రాంతపు కార్మికులు, కర్షకులు కష్టాన్ని మరచి అధికోత్సాహంతో అమ్మవారి జాతర మహోత్సవాలలో పాల్గొని, ఆనందాన్ని పంచుకొంటారు. కొల్లేటి ప్రజావాళికి ఈ జాతర పెద్దపండుగ వంటిది. ఒక కొల్లేటి లంకలోని శ్రీ పెద్దింటి అమ్మవారి గుడి నేటికీ నిలిచి ఉంది.

-డి.సత్యమూర్తి