Others

కాల చక్రములో ‘వికారి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. ఖాళీ ఆకాశంలో నిరంతర చలనం కాల చక్ర భ్రమణం
ప్రాతిభాసిక, వ్యవహారిక స్వప్న జగత్తులలో నిర్యాణం వరకు ప్రయాణం
జీవితం కోరికల హరివిల్లు మన్మథుని పంచపుష్పబాణ కామాకర్షణం
కోరికల ఓతపాతలు కాకూడదు ‘వికారి’ లో ‘మనీషామమ’

2. వ్యక్తి ఒక వృక్షం సమిష్టి ఒక వనం, సృష్టి ఒక సంకల్పం
వృక్షం లోన జీవకణం, ఆకులోని పచ్చదనం పువ్వులోని పరిమళం
కాయలోని పుల్లదనం పండులోని తియ్యదనం అణువులోని అదృశ్యం
ప్రత్యగాత్మలోని పరమాత్మ నిరాకార చైతన్య జ్యోతి స్వరూపం కానగలం వికారిలో

3. కాలానికి గరిమినాభి సవిత్ర మండల మధ్యవర్తుడైన ఆదిత్యుని హృదయం
విశ్వానికి అణిమనాభి బిందుర్గతాంత నిరాకార విశ్రాంత స్వయం ప్రకాశం
అష్ట సిద్ధులు నవ నిధులు కైవల్య సాధనములో వైకల్య ‘వికార’ సముదాయం
నామ రూప రహిత నిరాకార నిర్గుణ తత్వతృష్ణా తీత ‘వికారి’ నూతన సంవత్సరం వసంతం

4. వినయము లేని విద్య స్వేచ్ఛలోని ఆరాజకము పోవలె ‘వికారి’
ప్రవఠ్తన లేని ప్రగల్భ ప్రవచనములు ఆత్మజ్ఞాన ఆచరణకు ఆటంక కంటకములు
అంతర్ముఖ హృదయాకాశ వృత్తి వ్యాపార అంతర్యామి ప్రయాణ వీక్షణమే సమాధికి సాధనం
మనస్సులో తమస్సును తొలగించి తేజస్సును ప్రసాదించు ఓజస్సు కావలె‘ వికారి’లో

5. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః సంకల్పం కాల ‘వికార’ం
కాలపు కడలి కడుపులోని కోరికల లోతుల అగాధం ‘వికారి’
విషయ వాసనల వికారముల కురుడీ పూర్తిగా పూర్ణాహుతి చేయు ‘వికారి’ లో
శ్రీదత్త గురు కృపాకటాక్ష వీక్షణం కొరకు నిరీక్షణే మన తక్షణ కర్తవ్యం

6 ఆరవ తేదీన వచ్చే అరవై మధ్యమున ఉన్న సంవత్సరాది ఉగాది ‘వికారి’
ఆరులో దాగియున్నవి ఆరు స్థూల శరీర వికారములు ‘వికారి’లో
ఆరు అరిషడ్వర్గాలు, షడ్దర్శనములు వెన్నుపాములోని ఆరు క్రములు
ఆరు కృత్రికలు పాలు తాగిన కార్తికేయుని ‘శక్తివేల్’ కాపాడు ‘వికారి’లో
ఆరు చేతులు అత్రి పుత్రుడు ఆశీర్వచనముల అక్షింతలు ఆశిద్దాం నూతన ఆమనిలో

- రూపావతారం లక్ష్మణ మూర్తి , 7207074899