Others

మరవకూడనిది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైందవం తల్లిఋణము తీర్చుకోలేనిది అంటుంది. జన్మ నిచ్చి దారిచూపిన తల్లికి ఎంత సేవ చేసినా తక్కువ అవుతుంది. జన్మనిచ్చిన తల్లి, మాతృభూమి స్వర్గముకంటే మిన్నఅనంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవము. ఇక్కడ కూడా ప్రథమ స్థానము మాతృమూర్తికే. సృష్టికి ఆదిదంపతులు పార్వతి పరమేశ్వరులు. వీరి కుమారుడు తల్లిదండ్రుల శక్తి ఏమిటో లోకానికి చాటాడు. ఆదిదేవుడు విఘ్నంకరుడు అయన విఘ్నేశ్వరుడు గణాధి పత్యం కోసం కుమారునితో ఒకసారి పోటీ పడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల కుమారులైన వీరిద్ద రూ ఆధిపత్యం కోసం పోరాడు తుంటే పరమే శ్వరుడు వారికి ఒక ఉపాయం చెప్పాడు. లోకం లో ఉన్న అన్నీ ఫుణ్య నదుల్లో ముందుగా ఎవరు స్నానం చేసి వస్తారో వారే ఆధిపత్యం వహించ వచ్చు అన్నాడు. దాంతో వెంటనే కుమారస్వామి తాను అధికుడుగా ఉండాలన్న కోర్కెతో నధీస్నానం కోసం నెమలి వాహనమెక్కి వెళ్లాడు. కాని అక్కడే మరుగుజ్జు రూపం, పెద్దబొజ్జతో ఉన్న వినాయకుడు ఆలోచించి తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షణం చేశాడు. దానివల్ల కుమారస్వామి కన్నా ముందే అన్నీ పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యాన్ని ఆర్జించినవాడయ్యాడు. అంటే తల్లిదండ్రులను మించిన పుణ్య నదులేమీ లేవనే కదా దీనర్థం.
మునికుమారుడైన శ్రవణుడు వృద్ధులైన, గ్రుడ్డివారైన తల్లిదండ్రులను కావడిమీద మోస్తూ నిరంతరము మాతా పితరుల సేవలో తరించారు. పక్షిరాజైన గరుడుడు తల్లి దాస్య విముక్తికి నాగులకు అమృతభాండం తీసుకురావడానికి మహేంద్రునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అమృత భాండం సమర్పించి తల్లికి దాస్య విముక్తి కలిగించి తన మాతృభక్తిని చాటాడు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసం 14 సం. వనవాస దీక్షను స్వీకరించాడు. ఆఖరికి రాక్షసుడు మూర్ఖుడు అయన రావణుడు కూడా మాతృభక్తిని కలిగియున్నాడు. తన తల్లి కోర్కె తీర్చటం కోసం పరమేశ్వరుని ఆత్మలింగం కోసం తీవ్రమైన తపస్సు ఆచరించాడు. దానివల్ల పరమేశ్వర అనుగ్రహం పొందాడు. మహాభారతంలో భీష్మ పితామహుడు తన తండ్రి శంతనుని సుఖ సంతోషాలకోసం తన సుఖాన్ని, జీవితాన్ని త్యాగం చేసి, ఆజన్మ బ్రహ్మచారిగా నిలిచి చరిత్ర ప్రసిద్ధికెక్కాడు. పరశురాముడు తండ్రి కోపాగ్ని ని చల్లార్చి తండ్రి మాటను ఆచరించి తిరిగి ఆ తండ్రి చేతనే తన తల్లిని పునర్జీవింప చేసుకొన్నాడు. కానీ నేడు ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లల నిరాదరణకు గురవు తున్నారు. ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు నెలకొంటున్నాయ. అక్కడ తల్లిదండ్రులు తమకు నెలవు లేకుండా పోయందన్న బాధలో జీవనం చేస్తున్నారు. మనలను కని పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు చెప్పించి మంచిదారి చూపించిన వారిని వారి వృద్ధాప్యంలో చేదోడు అవకపోవడమనేది మానవత్వం లేనట్లుఅవుతుంది. వారి వేదన పిల్లలకు మంచిదికాదు కనుక ఇప్పటికైనా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవచేయడం మన కర్తవ్యంగా భావిద్దాం.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి