Others

ఇంకా ఏముంది వసంతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకీ మావికొమ్మ
విప్లవ గీతాలు వినిపిస్తోంది?
ఎందుకీ మూగ ఎండ
మట్టిని కూడా కాల్చేస్తోంది?

కాలాన్ని కలంగా
మార్చుకుని కాల పురుషుడు
ఏకథ వ్రాయాలనుకొంటున్నాడు?
ఏ యే వ్యధలు చెప్పాలనుకొంటున్నాడు.?

వసంతం ! నీకేమైనా తెలుసా?
వికారం మొగం పెడతావేం?
తెలుగు వారంటే అంత అలుసా?
నిన్నకాక ఆ మొన్నటిదాకా
మొన్న కాక ఆమున్నటి దాకా
నీరాకకు తోరణాలయ్యామే!

తెలుగు వాకిట రంగవల్లికలయ్యామే!
వెలుగుల వెల్లువై వస్తావని
వేగిరిపడి పోయామే!
ఇదేంటి వసంతం!

ఇంత వికృతంగా మారావు?
వస్తున్నా నన్నావు! తెస్తున్నానన్నావు !
ఇచ్చేస్తున్నానన్నావవు
మా ఆశలు అంగలార్చుకుని
మా ఆకాంక్షలు ఆవిర్లయి
మా పౌరుషం పురిట్లో సంధికొట్టుకుని
మా ఆత్మాభిమానులం అతలాకుతులమై

గంతలు కట్టుకున్న కళ్లలోంచి
నిజాల్ని వెలికి తీస్తున్న
కలల ప్రవాహంలో
ఈదులాడే యువతర ప్రస్థానం
ఆకులు కదలని తోటలో
ఒంటరి పక్షులమై మిగిలిపోతున్నాం
చికాకుల చిగురు శాలువాలు కప్పుకుని
బహు పరాకుల
బాకాలూదుకుంటున్నాము
ఇంకెక్కడి
వసంతాగమన సుమ మాలికా
పరిమళ గీతాలు
ఎక్కడ చూచినా హరితకణాలు
హరించుక పోయిన
ఫలిత పత్రాల గృహ తోరణాలు !!

బి.ఎస్. నారాయణ దుర్గ్భాట్టు 9346911199