Others

దేవతలారా దిగిరండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా! మమ్ము
గాచేటి వాడవే కరుణతోడ
శ్రీ శంకరా! మాకు సిరులిచ్చి బ్రోచేటి
వాడవీవే నయ్య భవభయ హర
మంగాపతీ! మాకు మార్గంబు ఁజూపుచు
రెప్పవై గాచేటి ఱేడువయ్య
శ్రీ ఆంజనేయ! మా సేమంబుఁ గోరేటి
వాడవే! శ్రీరామభక్తితోడ

తే.గీ. మమ్ము గావంగ రారండి మాదు పూజ
లందుకొనరండి వేల్పులు లాసమల్లు
కొనగ మాయిండ్లు వేయేండ్లు కొలదిగాక
దీవెనలనొసగంగను దిగియు రండి!

భావం: విఘ్నాలను తొలిగించే ఓ విఘ్నేశ్వరా! మమ్ముల్ని కరుణతో కాపాడే వాడవు నీవే. శంకరా! మాకు సకల సంపదలనిచ్చి భవభయాలను హరిస్తూ కాపాడేవాడవు నీవే. మంగాపతీ! మాకు సన్మార్గాన్ని చూపెడుతూ కంటికి రెప్పవై కాపాడే స్వామివి నీవే. ఆంజనేయా శ్రీరామ భక్తితో మా క్షేమాన్ని కోరేవాడవు నీవే. దేవతలారా! మా పూజలందుకొంటూ మమ్ముల్ని కాపాడడానికి వేయేండ్లు మా యిళ్లన్నీ నవ్వులల్లుకునే విధంగా దీవించడానికి భువికి రండి.
సీ. స్వార్థ రాహిత్యంబు పరహిత కార్యంబు
ఆత్మ విశ్వాసంబు హాసమొప్ప
మడమఁ దిప్పని నైజమాచితూచిన మాట
పరుల సేమంబునుఁ బ్రతిభయొప్ప
సంతృప్తి సత్కీర్తి సచ్ఛీలతాదులు
వితరణ భావంపు వెలుగు లొప్ప
ధర్మకార్యంబులు దప్పుఁ బల్కని తత్త్వ
మెన్నియో సుగుణాలు మెఱుపులొప్ప

తే.గీ. జన్మ చరితార్థమగునట్లు సవ్యమైన
బాటఁ బట్టుచు నడయాడ బహువిధాల
దివ్య తేజాన వెల్గులు విసరవచ్చు
కేలుమోడ్తురు సర్వంబు గెల్వవచ్చు!

భావం: నిస్వార్థం, పరహిత కార్యం,. ఆత్మవిశ్వాసం, ఆనందం, వెనుదిరగని స్వభావం, ఆచితూచి మాట్లాడడం, సంతృప్తి, పరుల క్షేమం కోరుకోవడం, ప్రతిభా సంపత్తిని కల్గి యుండడం, సత్కీర్తి, సచ్ఛీలత,, దాతృత్వం, ధర్మకార్యాలు చేయడం, తప్పు పలకని స్వభావం వంటివి కలిగి యుండి జన్మ సార్థక్యానికి గాను సక్రమ మార్గాన నడచిన పక్షం దివ్యతేజస్సుతో వెల్గులు విరజిమ్మవచ్చు. తద్వారా అంతా చేతులెత్తి నమస్కరించడమే గాక సర్వాన్నీ గెలవవచ్చు.
వివరణ: భారతదేశంలో పుట్టి హిందువుగా ఎదిగి పరమాత్మ తత్వాన్ని అర్థంచేసుకొంటే కాలమహిమను అవగాహనకు తెచ్చుకుంటే స్వార్థంకానీ, పరాయ సొమ్మును లాక్కోవాలన్న బుదిధ ఇలాంటివేవైనా ధగ్గరకు రమ్మనా రావు. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కొందరు ఒకప్పుడు రాజులుగా ఉంటే మరికొందరు బోయలు అనుకొందాం. కాల క్రమంలో ఈ బోయలే రాజులు, రాజులు బోయలూ అవుతారు. అంటే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం ఇలా కాలచక్రంలో ఒకటి పైకి కిందకు తిరుగుతూ ఉంటాయని తెలుస్తుంది. అది తెలుసుకొంటే అవ గుణాలకు దూరం కావచ్చు.
సీ. కినుక పొడమి చేతఁ దనువెల్లఁగంపించి
తారతమ్యంబులఁ దరిమికొట్టి
స్థితి గతులనువీడి తిట్టు లందిట్టుచు ఁ
దిట్టులంబడుదురు తెలివి ఁ దప్పి
ఏలకో జనులిల మేలుకోఁ దలపక
నజ్ఞాన తిమిరాన హద్దుమీరి
వర్తించు చుంటిరే పంతాలు పట్టింపు
లనుఁ గల్గి నడతురు కనగ జగతి

తే.గీ. బ్రతికినన్నాళ్లు బాధలు పడుట యేల?
చచ్చి సాధింపఁ బోరేమి సావధాన
ముగను యోచించి యడుగిడ మోదమలరు
శాంతి పవనాలు వీచును చల్లగాను!

భావం: కోపం చేత ఊగిపోతూ తారతమ్యాలను గుర్తించకుండా స్థితి గతులను తప్పి పరస్పరం తిట్టుకుంటూ తెలివి తక్కువ తనంతో మేలుకోకుండా అజ్ఞానాంధకారంలో హద్దుమీరి పంతాలతో పట్టింపులతో ప్రవర్తిస్తున్నారెందరో! బ్రతికి నన్నాళ్లూ బాధలు పడడం దేనికి? చచ్చి సాధించేదేముంది? సావధాన చిత్తులై బాగా ఆలోచించి ముందుకు సాగిపోన పక్షంలో జీవితమంతా ఆనందమయం అవుతుంది. అంతటా చల్లని శాంతి పవనాలు వీస్తాయి.

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం సెల్: 9492457262