Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసన లేని పూవువలె వాక్కు రచించని విద్యలేల పే
రాల సంపదల్ శుభమునందగ జేయవు జ్ఞాన సిద్ధిచేన్
సంస్కృతి బాపి మానవుల జన్మము సార్థకమందజేయవే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

వేసములెన్నో వేసితిని విత్తముకోసము చిత్తమందునన్
దోసము లెన్నొ జేసితిని దుర్విధినన్ దరుమంగ నింకనే
జేసిన పాపముల్ మనవి జేసెద దాసుని బ్రోవుమమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!
నా సములెవ్వరంచు గణసమ్మును సేయక సజ్జనాళిపై
రోసము బూని గర్వమున రొప్పితి నొప్పని తప్పు చేతలన్
గాసిలి నేడు రోసితిని కల్మష సంస్కృతి బాపుమమ్మ హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

బాసట లేరు యెవ్వరును బంధువులందరు రంధ శోధకుల్
నా సతి, నాదు సంతతి, ఋణానుగత అపతి బంధకమ్ములున్
నా సఖులన్నదమ్ములను నమ్ముటయె వృధ నీవె దిక్కు హే
వాసర వాసినీ ప్రధిత వాగ్వరదాయినీ ! శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342