Others

పాహిమాం పార్వతీశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చేయలనేయ్య నిత్యాభిషేకములను
తిరగ లేనయ్య నీ దివ్య గిరుల చుట్టు
ఆత్మలో ఁ జేతు నీ జపమదియుఁ గనుమ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: శంకరా! నిత్యాభిషేకాలను చేయలేను. మహత్తరమైన నీ గిరుల చుట్టూ తిరుగలేను. విడువక మనస్సులోనే నీ నామ స్మరణ చేస్తాను స్వామీ.
తే.గీ. నమక చమకాలు వల్లింప నలవికాదు
లింగమూర్తివి నిన్ను గాలింగనంబుఁ
జేసికొని వేడుకొనె దనే శిరము వంచి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: పార్వతీ పతీ నమక చమకాలు వల్లించే శక్తి నాకు లేదు. లింగమూర్తివైన నిన్ను గాఢంగా ఆలింగనం చేసుకుని శిరస్సు వంచి వేడుకుంటాను స్వామీ!
తే.గీ. చంద్ర వౌళీశ్వరా ! శివా! సాంబమూర్తి!
అర్థనారీశ్వరా! ప్రభూ! హర్షమొంది
శతక రచనకు బూనితి శ్రద్ధతోడ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: చంద్రవౌళీశ్వరా! శివా! సాంబమూర్తీ! ప్రభూ! నీ అనుగ్రహంతో అనందంగా శతక రచనను పూనుకొన్నాను స్వామీ.

తే.గీ. స్వామీ! నీయాజ్ఞలేనిచే చీమయైనఁ
గుట్టబో దందురే శివా! కొలచునట్టి
వాడ నేయాజ్ఞ నిడెదవో? భస్మధారి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: స్వామీ! నీ యాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. నినే్న నమ్మి కొలచే నన్ను ఏమని ఆజ్ఞాపిస్తావో కదా భస్మధారీ!

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం