Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గో సముదాయమొక్క పరిగోష్ఠము జూచిన జాలునింక స
భ్యాసవశమ్ము వోలె సమయమ్మును తప్పక వచ్చి చేదుగా
నీ సరి మానవుండు తన మీమము నింత తలంప డేలకో
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

పోసవరించు కోరికలు పున్నమి సంద్రము వోలె పొంగ, రా
కాసి తిమింగలమ్ములటుగ్రమ్నెను లోభము మోహమింక పే
రాస మొసళ్లు క్రూరముగ నాసిలుచుండె గ్రసింప బ్రోవవే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

మూసను బోసి వోజు ద్రవమున్ వర మూర్తిగ రూపు దిద్దు తా
శాసన జేసి రాజు జన సంఘమునంతయు కట్టడించు స
న్యాసము చేత మానవుడు నాత్మ వినిగ్రహమంద గావలెన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

మోసలయందు గూర్చుని సముద్ధతితో జగడమ్ములెన్నియో
తాసరి తీర్పు చెప్పు పురధర్మవిదుండు స్వకార్యమందు నే
దోసరి మాటలాడి పెడద్రోవను పోవును ధర్మహీనుడై
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342