Others

అపర వేదవ్యాసులు గుండి రాజర్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ ప్రాచీన ఆర్ష విద్యలకు నెలవై, హైందవ సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, వరదాయిగా, భక్తిముక్తి ప్రదాయినిగా తెలుగునేలపై వాసికెక్కిన గోదావరీ తీరస్థ పవిత్ర తీర్థరాజం ధర్మపురి క్షేత్రంలో పురాణ ప్రవచన కార్యక్రమం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.
వ్యాస, వాల్మీక, కాళిదాస, కాణాద, పైల, జైమిని, పరాశర, ఆపస్తంభాది మునులు, ఋషులు, యోగులు, కర్మిష్ఠులు, పరివ్రాజకుల, ఆధ్యాత్మికుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, దేవతా పూజలతో, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక కార్యక్రమాలను, అక్షయ నిధులైన పురాణ ప్రవచానాలను క్షేత్రరాజం కాపాడుతూనే ఉంది. అయితే అపర వేదవ్యాసులుగా పేరెన్నికగన్న శ్రీగుండి రాజర్షి తన స్వగృహంలో ప్రవచనాలను నిర్వహించగా, దివంగత భారత ప్రధాని పివి నర్సింహారావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ఆచార్య దివాకర్ల వెంకటావధాని, తెనే్నటి విశ్వనాథం, విశ్వనాథ సత్యనారాయణలాంటి మహామహులెందరో ప్రత్యేకించి, క్షేత్రానికి వచ్చి, రాజన్నశాస్ర్తీ భాగవత ప్రవచనాలను విని ఆధ్యాత్మిక లోకాలలో విహరించి, ఆయనకు ప్రణమిల్లిన సంఘటనలు క్షేత్రవాసులకు చర్విత చర్వణాలే. కవి సామ్రాట్ విశ్వనాథచే ‘మ్రోయు తుమ్మెద’లో వర్ణించబడిన గుండి రాజన్న శాస్ర్తీ అష్టాదశ పురాణాలను నిరంతర అధ్యయనం చేస్తూండగా, పాశ్చాత్య పండితులెందరో పౌరాణిక సందేహ నివృత్తికై శాస్ర్తీ వద్దకు వచ్చి వెళ్ళిన సంఘటనలు క్షేత్ర వాసులకు నిత్య జ్ఞాపకాలే. సాక్షాత్తూ వేదవ్యావరాతంగా భావించ బడే రాజన్న శాస్ర్తీ విగ్రహపతిష్ఠ చీసి, ఆలయం నిర్మించి, నిత్య పూజలు జరపడం విశేషం.
ధర్మపురీ క్షేత్రంలో గుండి లక్ష్మీనరసింహ ఘనాపాఠి, లక్ష్మీనర్సమ్మ దంపతులకు 1893 డిసెంబర్ 9న జన్మించిన శాస్ర్తీ, గుండి పాపయ్య కుటుంబానికి దత్తపుత్రులైనారు. బాల్యంనుండే ప్రహ్లాదాదుల వలె పరమాత్మ చింతనాపరులై, దివ్య ప్రంబంధాదుల గానంచేస్తూ, ప్రాథమిక విద్య ఉర్దూ భాషలో జరిగినా, అష్టవర్షములకే ఉపనయన సంస్కారులై, గాయత్రీ మంత్రోపాసకులై, వేదాధ్యయనాలు తండ్రి వద్ద చేసి, లీలావతి గణిత సాధకులై, మంథనికి చెందిన గట్టు కృష్ణశాస్ర్తీ వద్ద అమరభాషను, శాస్త్రాలను నేర్చుకున్నారు. అనంతరం వేదవేదాంగ శాస్త్రాగమ, ప్రస్థాన త్రయ, సాయణ భాష్య శాంతి పాఠాలను, రామాయణ భారత భాగవతాది పురాణాలను, ప్రధానంగా భాగవత, బ్రహ్మసూత్రాలను కంఠోపాఠముగా చెప్పగలిగిన అసాధారణ ధారణ శక్తి సంపన్నులైనారు. స్థానిక లక్ష్మీ నరసింహ మందిరంలో కొంతకాలం నిరంతర భాగవత సప్తాహ యజ్ఞాలను నిర్వహించారు. ఉష:కాలమందే లేచి, నిత్య గోదావరి స్నానం, సంధ్యావందనం, ధ్యాన దారణ పూజోపాసన పారాయణాది సత్కార్యాచరణ నిత్య కృత్యాలుగా కలిగి ఉన్నారు. సమకాలీన సలక్షణ వేద ఘనాపాఠీల సన్నిధిలో, వేదార్థ ఉపనిషత్ భాష్య ప్రవచన గావించేవారు. భక్తబృంద సమేతంగా రాత్రి సత్సంగ భక్తిమయ జాగరణలు, సంగీత సభలు, సాహితీ గోష్ఠులు, భజనలతో గడిపే వారు. ప్రధానంగా ధర్మపురి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి, నృసింహ నవరాత్రులు, శివరాత్రులు, ఉగాది ఆదిగా పర్వదిన వేడులకను ప్రారంభించి, ఆచరింప చేశారు. పిత్ర, స్వార్జితములను దానధర్మాలకు, సన్మానాలకు ధారవోసిన దానగుణ సంపన్నులైనారు. బాలబాలికలచే సంస్కృతం మాట్లాడింప చేస్తూ, బాలురచే శృతి, స్మృతి, పురాణ, కావ్య, భక్తిరస ప్రధాన శ్లోకాలను, పద్యాలను కంఠంస్థం చేయించేవారు.
1966 విజయదశిమి నాడు క్షేత్రస్థ రామలింగేశ్వరాలయంలో సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. నేటికి అది వేలాది మంది భాషా పండితుల తయారీ కేంద్రంగా భాసిల్లుతున్నది. దేశ విదేశీయులు శాస్ర్తీ దర్శనంచేసుకుని, పలు సందేహాల నివృత్తిని చేసుకునే వారు. శ్రీశ్రీశ్రీ శృంగేరీ, కంచి కామకోఠి, పుష్పగిరి, హంపీ, మధ్వ పీఠాధిపతులు, శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీయర్ స్వామి తదితర జగద్గురువులు క్షేత్రానికి దర్శనార్థం విచ్చేసిన అన్ని సందర్భాలలో వారి సన్నిధిన అష్టాదశ పురాణ సందర్భాలను ప్రవచనలు గావించి, వారిచే సన్మానితులైనారు. పీవీ, బూర్గుల రామకృష్ఠారావు, చెన్నారెడ్డి, సంజీవయ్య, తెనే్నటి, విశ్వనాథ, దివాకర్ల, బిరుదు రామరాజు, మల్లాది చంద్రశేఖర శాస్ర్తీ, మార్కండేయ శాస్ర్తీ, కప్పగంతుల లక్ష్మణ శాస్ర్తీ తదితరులు పలుమార్లు శాస్ర్తీ వద్దకు ఏతెంచి, పునీతులమైనామని భావించి, అపర వేదవ్యాసులుగా కీర్తించిన సందర్భాలు అనేకానేకాలు. 84వత్సరాలు జీవించి, ధర్మపురి వాసులను సన్మార్గమున నడిపి, 1975 మే 30న జీవన్ముక్తులై, శివైక్యం పొందారు. నిత్య నిరంతర పురాణ ప్రవచనాలే నిత్యానందంగా భావించి, సిద్ధి పొందిన తాపసి రాజర్షికి, గోదావరి తీరాన, రామమందిర సమీపాన స్థిర విగ్రహ ప్రతిష్ఠ గావించి, గుడి కట్టి, నిత్య పూజలు నిర్వహింప చేయడం ధర్మపురి వాసులు చేసుకున్న పురాకృత సుకృతం.
*
రాజన్న శాస్ర్తీ వర్ధంతి సందర్భంగా

- సంగనభట్ల రామకిష్టయ్య