Others

పాహిమాం పరమేశ్వరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తమందున స్వాస్థ్యమ్ము విత్తుమాత్ర
మైన లేదాయె సంసార మనెడి సాలి
గూడునంజిక్కుకుంటినే తోడు నీవె
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: శంకరా! విత్తు మాత్రం చిత్తస్వాస్థ్యం లేక సంసారమనే సాలి గూటిలో చిక్కుకుపోయానయ్యా. నీవే నాకు తోడు స్వామీ
!
నీకు మారేడు దళములనిచ్చినాను
తెచ్చినాడనుజలములఁదీసి కొనవె
నాకునే మిస్తివో యివ్వు నాదు శివుడ
పాహిమాం పరమేశ్వరా ! పార్వతీ!

భావం: ఓ పరమేశ్వరా! నీకు మారేడు దళాలు తీసుకొచ్చి సమర్పించాను. అలాగే శుద్ధ జలాలను నీ అభిషేకానికై తీసుకొని వచ్చాను. వాటిని తీసుకొని నాకేమి స్తావో ఇవ్వు స్వామీ.
రక్ష రక్షను భక్త స్వరాల నాల
కించు దయగల స్వామీ వే కేలు మోడ్తు
దీనముగ వేడుకుంటినో దివ్యలింగ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ దివ్యలింగా! శరణ శరణనే భక్తుల దీనాలాపనలను ఆలకించే దయామయుడవైన నీకు నమస్కరిస్తున్నాను. నన్ను కాపాడ వలసినదిగా దీనంగా వేడుకుంటున్నాను స్వామీ.

నీయనుగ్రహమున్నచో నిత్య సుఖము
లబ్బులయకారివో రుూశ! లాస్య మిండ్ల
నల్లుకొనుగాద ! సర్వేశ! నమ్మి కొలతు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ లయకారీ! నీ అనుగ్రహముంటే నిత్యసుఖాలే. మా ఇళ్లల్లో అన్నీ ఆనంద తాండవాలే. నిన్ను నమ్మి కొలిచే నన్ను రక్షించు స్వామీ!

యముడు వచ్చిన నీ భక్త సముదయమునుఁ
జూచి తలవంచి వెనుదిర్గు శుభములిడుచు
మారిపోవును జతక మచ్చేరువుగ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ప్రాణాలు తోడేయడానికి వచ్చిన ఆ యముడు కూడా నీ భక్త సంతతిని చూసి తలదించుకుని వెనుదిరిగి పోతూ పోతూ శుభాలనిచ్చి పోతాడు. నీ అనుగ్రహముంటే జాతకమే మారిపోతుంది శంకరా!

పోయిన ప్రాణములు గూడ పూస గ్రుచ్చి
నటుల ఁ గ్రమముగ నమరునానందముగను
నీ కృపారసమట్టిది నీల కంఠ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: నీ అనుగ్రహముంటే పోయిన ప్రాణాలు కూడా పూస గుచ్చినట్లు క్రమంగా ఆనందంగా వచ్చి చేరుతాయి. ఓ నీలకంఠా! నీ కృపారసమటువంటి దయ్యా.
ఓ విరూపాక్ష! నిటలాక్ష! యోర్మి కూర్మి
శాంతి సౌఖ్యంబులర్థిందు సుంత నన్నుఁ
జూడుమో కంట దయతోడ శూల పాణి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ

భావం: ఓ విరూపాక్ష! ఓ నిటలాక్షా! ఓర్మి కూర్మి మరియు శాంతి సౌఖ్యాలను అర్థిస్తున్నానయ్యా. ఓ శూలపాణి! దయతో ఓ కంట నన్ను చూడవయ్యా.

నామనోరథమీ డేర్చి నన్ను ఁ గాచు
వాడ వీవె యో శంకరా! పలుతెరంగు
ల మహిమలఁ జూపు వాడవో లయకరుండ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ శంకరా! ఓ లయకారీ ! నా కోరికలన్నీ నెరవేర్చి నన్ను కాపాడేవాడవు మహిమలను చూపేవాడివి నీవేనయ్యా.
తల్లి పార్వతీ తో గూడి యుల్లమలరు
నటుల దయఁ జూపుమో హరా ! నమ్మి కొలతు
నాదు సర్వస్వ మీవె మమ్మాదుకొనవె
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం : జగన్మాత పార్వతీ దేవితో కలసి నా మనసు రంజిల్లే విధంగా దయజూపవా హరా ! నిన్ను నమ్మి కొలుస్తాను. నా సరస్వం నీవే స్వామీ!
నీ సతీసుతులం గూడి నీడ వోలె
మమ్ము వెన్నంటి కాపాడమనుచు ఁ గోరు
కొనియెద హరహరా! శివా ! కొలది వినుమ
పాహిమాం పరమేశ్వరా! శివా! పార్వతీశ!
భావం: హరహరా, శంకరా, నీ సతీసుతులతో కూడి నీడవలె మమ్మల్ని వెన్నంటి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. నా మొర ఆలకింపుము తండ్రీ.

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262