Others

భగవంతుని కరుణ పొందే మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకానొక కాలంలో వ్యాస మహర్షికి మనసు వ్యాకులం చెందింది. హృదయావేదన కలిగింది. అపుడు నారదమహర్షి అక్కడికి వచ్చాడు. విషయం గ్రహించాడు. సర్వ ధర్మాలను వివరించే మహాభారతం రచించి నప్పటికీ ఈ మనోవ్యాకులత వ్యాసునికి ఎందుకు కలిగి ఉంటుందని ఆలోచించాడు. అపుడు భారతాన్ని రచించినా అందులో శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలను ఎక్కువగా వర్ణించి చెప్పకపోవటం చేతనే అలాంటి మనస్తాపంకలిగి ఉంటుందని అనుకొని ఆ విషయానే్న వ్యాసునికి వివరించాడు. మహావిష్ణువు గుణ గణాలను, శ్రీహరి నామాన్ని స్తుతిస్తే ఎంతటి వారికైనా మనస్తాపం నశిస్తుందనికూడా హితబోధ చేశాడు. భగవంతుని ఆశీస్సులు తనకు పూర్వంలో ఎలా లభించాయో వివరిం చడానికి పూర్వ జన్మ వృత్తాంతానే్న నారదుడు వ్యాసుడికి వివరించాడు.
పూర్వజన్మలో వేదాధ్యయన సంపన్నుడైన ఓ గొప్పవారి ఇంట పనులు చేసే దాసికి పుత్రుడుగా జన్మించాను. ఓసారి ఆ ఇంటి యజమాని వానాకాలంలో నాలుగు నెలలపాటు చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఋషులకు సేవ చేయడానికి ఈ దాసీ పుత్రుడిని పంపించాడు. ఋషుల దగ్గర ఆ దాసీ పుత్రుడు ఎంతో ఒద్దికగా సేవ చేస్తూ మన్ననలు అందుకున్నాడు. ఆ బాలుడి భక్తిశ్రద్ధలకు ఋషులు ఎంతగానో సంతోషించారు. అలా ఋషుల ప్రేమను చూరగొన్న ఆ బాలుడు నిరంతరం వారిలానే హరినామ సంకీర్తనం చేయసాగాడు. చాతుర్మాస్య దీక్ష ముగిసిన తర్వాత ఋషులంతా మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరుతూ ఆ బాలుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం ఆ మంత్రన్ని జపిస్తూ ఉండమని చెప్పివెళ్లారు.
బాలుని రూపంలో ఉన్న నేను విడవకుండా నారాయణ మంత్రాన్ని జపించసాగాను. కొన్నిరోజుల తరువాత నా తల్లి ఓ రోజున పాముకాటుకు గురై మరణించింది. ఇక అక్కడ ఉండలేక ఉత్తర దిక్కుగా తన ప్రయాణం సాగించాడు. అలా ఎనె్నన్నో నగరాలు, పట్టణాలు అడవులు దాటుతుండగా మధ్యలో ఓ నది కనిపించింది. నిర్మల జలాలలో స్నానం చేశాను. ఆ తరువాత ఆ నదిని ఆనుకునే ఉన్న అడవిలో ఓ రావి చెట్టు దగ్గర కూర్చుని పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీహరిని ధ్యానించసాగాను. అలా ఏకాగ్రతతో ధ్యానం చేస్తుండగా శ్రీహరి స్వరూపం కనిపించింది. అనుకోని విధంగా జరిగిన ఆ పరిణామానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి నిలుచుని చుట్టూ చూశాను కానీ ఎక్కడా ఆ దివ్య స్వరూపం కనిపించలేదు. అలా తరుగుతున్న నాక్తు ఓదార్పుగా అశరీర వాణి మాటలు వినిపించాయి. అలా విచారిస్తూ దేవుడు కనిపించటం లేదని, దేహాన్ని శుష్కింపచేసుకుంటూ ఎంతకాలం తిరిగినా ప్రయోజనం లేదని అశరీరవాణి పలికింది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించి, కర్మలన్నింటినీ నిర్మూలన చేసి, పరిశుద్ధుడైన యోగిగా మారితే తప్ప దైవదర్శనం కాదని అశరీరవాణి పలికింది. దైవసేవ వలన భక్తి వృద్ధి అవుతుందని, దానివల్లనే భక్తుడి మనస్సు భగవంతుడిమీద నిలుస్తుందని, ఇంతటి కృషి చేయటానికి ఈ బాలుడి జన్మ సరిపోదని, కనుక మరుసటి జన్మలో భగవంతుడికి చేరువయ్యే అవకాశం ఉంటుందని ఆ దైవవాణి పలికింది. ఆనాటి నుంచి నేను కామక్రోధాదులను విడిచి భగవంతుడి నామాన్ని, చరిత్రను నిత్యం పఠిస్తూ మరణించాను. అనంతరం నేను ఈ నారదుడిగా జన్మించి, సముద్ర మధ్యంలో ఉన్న శేషతల్పశాయిని దర్శించే భాగ్యాన్ని పొందాను అని వ్యాసుడితో తన పూర్వజన్మ వృత్తాతం చెప్పాడు. కనుక నీవు కూడా శ్రీహరి కథలను రచించుము అని చెప్పాడు.
అట్లానే మనుషులమైన మనమూ కూడా ఈ బంధాలల్లో చిక్కుకొనక నిరంతరమూ హరి భజన చేస్తూ ఉంటూ భగవంతుని కరుణను పొందగలుగుతాము.

- లక్ష్మీ ప్రియాంక